Getter: ట్విట్టర్ కు పోటీగా గెట్టర్…లాంఛ్ చేసిన ట్రంప్ టీం!

ట్విట్టర్….పలు వివాదాలతో ఈ మధ్య తరచుగా వార్తల్లో నానుతోంది. ఈ సమయంలో ట్విట్టర్ కు ప్రత్యామ్నాయంగా మరో ఫ్లాట్ ఫామ్స్ గురించి వెతుకుతున్నారు నెటిజన్లు. ఇంతలో సైలెంట్ గా ట్విట్టర్ పోటీగా గెట్టర్ అనే సామాజిక మాధ్యమం లాంఛ్ అయ్యింది. దాని పూర్తి వివరాలు తెలుసుకుందాం.
మైక్రోబ్లాగింగ్ ఫ్లాట్ ఫామ్ అయిన ట్విట్టర్ కు పోటీగా మరో యాప్ ఫ్లాట్ ఫాం తెరపైకి వచ్చింది. అమెరికా మాజీ అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ గ్రూప్ ట్విట్టర్ కు పోటీగా గెట్టర్ అనే కొత్త ఫ్లాట్ ఫాంను డిజైన్ చేసింది. ఇప్పుడు ఇది వరల్డ్ వైడ్ చర్చకు దారితీసింది. ట్విట్టర్ మాత్రమే కాదు …ఇతర సామాజిక మీడియా ఫ్లాట్ ఫామ్స్ కు గెట్టర్ ప్రత్యామ్నాయంతో పాటు గట్టిపోటీనివ్వనుందని ట్రంప్ టీమ్ నమ్ముతోంది. మాగా వెంచర్ లో గెట్టర్ కూడా ఒక పార్ట్. మాగా వెంచర్ కు ట్రంప్ మాజీ అధికార ప్రతినిధి జేసన్ మిల్లర్ సారథ్యం వహిస్తున్నారు.
ఇక క్యాన్సల్ కల్చర్ కు వ్యతిరేకత, కామన్ సెన్స్ ను ప్రమోట్ చేయడం, స్వేచ్చావాదాన్ని సమర్దించడం, సామాజిక మాధ్యమాల పెత్తనాన్ని సవాలు చేయడం, ఐడియాలను షేర్ చేయడం వీటన్నింటికి గెట్టర్ ద్వారా సాధ్యమని ఈ సంస్థ ప్రటించుకుంటోంది. ప్రస్తుతం యాపిల్ యాప్ స్టోర్ లో మాత్రమే ఈ గెట్టర్ ఫ్లాట్ ఫాం లాంచ్ అయ్యింది. బీటా వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. జూలై 4 ఉదయం పది గంటలకు అఫిషియల్ గా లాంఛ్ కానుంది. అయితే ట్విట్టర్ ప్రత్యామ్నాయంగా గెట్టర్ ఫ్లాట్ ఫాం ప్రారంభించడంలో ట్రంప్ ప్రమేయం ఉందా లేదా అనేది ఇంకా తెలియదు. ఇక గెట్టర్ యాప్ ను 17 సంవత్సరాలు పైబడినవారి ఎవరైనా వాడుకోవచ్చు.