అమెరికా…కెనడాను చెమటలు పట్టిస్తున్న టెంపరేచర్..!

ఎండాకాలం వచ్చిందంటే ఇండియాలో ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయి. ఇండియాను పక్కనపెడితే…మన తెలుగు రాష్ట్రాల్లో గరిష్ట ఉష్టోగ్రత ఎంతుంటుంది. ఎవరికి వారు గుర్తుతెచ్చుకుంటే…ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం ఒకరోజు 50 డిగ్రీలకు చేరింది. ఆ రెండు మూడు రోజులు జనాలకు చుక్కలు కనిపించాయి. సీన్ కట్ చేస్తే…ఆ తర్వాత 45 డిగ్రీలకు పరిమితం అయ్యింది. అంతమించిన సూరీడు ప్రతాపం చూపిన సందర్భాలు చాలా తక్కువనే అని చెప్పాలి.
మన భారత్ తో పోలిస్తే…చల్లగా ఉండే అమెరికా, కెనడాలోని చాలా ప్రాంతాల్లో ఇప్పుడు ఎండలు దంచికొడుతున్నాయి. సూరీడు దెబ్బకు తుకపెకఉడికిపోతున్నాయి. దాదాపు 1000 సంవత్సరాలకు ఒకసారి నమోదయ్యే గరిష్ట ఉష్ణోగ్రతలు లెటెస్టుగా ఆ రెండు దేశాల ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వేడిని తట్టుకోలేక నానావస్థలు పడుతున్నారు. ఒక అంచనా ప్రకారం ఎండ తీవ్రతకు తట్టుకోలేక బ్రిటీష్ కొలంబియా పశ్చిమ తీరంలో కనీసం 250మంది మరణించినట్లు అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం అక్కడ గరిష్ట ఉష్టోగ్రత 49.5డిగ్రీలు ఉంది. కెనడాలోని లైటన్ అనే ప్రాంతంలో మంగళవారం ఏకంగా 49.5డిగ్రీలు నమోదు అయ్యింది. దీంతో అక్కడ ప్రజలు అపసోపాలు పడ్డారు. ఇలాంటి పరిస్థితి 1000సంవత్సరాలకు ఒకసారి వస్తుందట. ఇప్పుడున్న వేడి…మరోవారం రోజుల పాటు ఉంటుందని అంచనా వేస్తున్నారు అక్కడి అధికారులు. ఈ వేడి తీవ్రతకు ముందు వరకు ఆ రెండు దేశాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీలకు మించి ఎప్పుడూ లేదు. అలాంది ఒక్కసారిగా 50డిగ్రీలకు చేరుకోవడం అంటే ఆశామాషీ విషయం కాదు.