సౌదీ సంచలన నిర్ణయం…భారత్ సహా ఆ దేశాలకు నో ఎంట్రీ..!

సౌదీ సంచలన నిర్ణయం…భారత్ సహా ఆ దేశాలకు నో ఎంట్రీ..!

కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని ఇంకా వణికిస్తునే ఉంది. రోజురోజుకు కొత్త కొత్త వేరియంట్లు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ వేరియంట్లను అరికట్టేందుకు సౌదీ అరేబియా ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇండియాతో సహా సౌదీ ప్రకటించిన రెడ్ లిస్టులో ఉన్నదేశాలకు వెళ్లే ప్రయాణికులు తిరిగి సౌదీకి రావద్దంటూ మూడు సంవత్సరాలు నిషేధం విధించనున్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. గతేడాది కోవిడ్ మహమ్మారి నుంచి తొలిసారిగా అధికారుల ముందస్తు అనుమతి లేకుండా మేలో విదేశాలకు అనుమతించిన కొందరు సౌదీ పౌరుల ప్రయాణ నిబంధనలను ఉల్లంఘించారని అంతర్గత మంత్రిత్వశాఖ అధికారులు వెల్లడించారు.

నిబంధనలు ఉల్లంఘించినట్లు రుజువైతే తిరిగి దేశానికి తిరిగి వచ్చాక భారీ జరిమానాతోపాటుగా మూడేండ్లు దేశంలోకి ప్రవేశించకుండా నిషేధానికి గురవుతారని కీలక ఆదేశాలు జారీ చేసింది. సౌదీ అరేబియా జారీ చేసిన రెడ్ లిస్టులో భారత్, ఆప్ఘనిస్తాన్, అర్జెంటీనా, బ్రెజిల్, ఈజిప్టు, ఇథియోపియా, ఇండోనేషియా, లెబనాన్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, టర్కీ, వియత్నాం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తోపాటు తదితర దేశాలు ఉన్నాయి. ఆయా దేశాలకు ప్రయాణాలను సౌదీ నిషేదించింది. 30 మిలియన్ల జనాభాకు ఈ గల్ఫ్ దేశంలో మంగళవారం కొత్త 13వందల కొత్త కరోనా కేసులు రనమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 5లక్షల20వేల 774 పెరగగా, మరణించిన వారి సంఖ్య 8వేల 9వందల 19కు చేరింది.

ఇదిలా ఉండగా కోవిడ్ విజ్రుంభన మొదలు కావడానికి కొన్ని రోజుల ముందు సౌదీ చరిత్రలోనే మొదటిసారిగా టూరిస్టు వీసాలను గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ సమయంలోనే అక్కడికి వచ్చే విదేశీయులును పరిగణలోనికి తీసుకుని ప్రభుత్వం కొన్ని ఆంక్షలను విధిస్తోంది. ముఖ్యంగా బిగుతుగా ఉండే దుస్తులు ధరించి బహిరంగ ప్రదేశాల్లో తిరగడం, ముద్దులుపెట్టుకోవడం వంటి వాటిపై నిషేధం విధించింది. మహిళలు తప్పనిసరిగా తమ భుజాలు, మోకాళ్లను కవర్ చేసుకునేలా దుస్తువులు ధరించాలి. ఈ నిబంధనలు అతిక్రమంచినవారిపై భారీ జరిమానా తప్పదు. టూరిస్ట్ వీసాతో సౌదీ వెళ్లేవారు విదేశీయులకు అక్కడి పద్దతులపై అవగాహన ఉండాలని పేర్కొంది.

ప్రస్తుతం 49దేశాలకు టూరిస్టు వీసాలకు అనుమతి ఇచ్చినట్లు సౌదీ సర్కార్ వెల్లడించింది. ఇందులో అమెరికా, ఆస్ట్రేలియాతోపాటు పలు యూరోపియన్ దేశాలున్నాయి. అమెరికా యూరోప్ వంటి దేశాల్లో వస్త్రాధారణ బహిరంగ ప్రదేశాల్లో ముద్దులు పెట్టుకోవడం సర్వసాధారణం. అయితే ఇలాంటివి సౌదీలో ఇక నుంచి కుదరవు అని చెప్పడానికే అక్కడి ప్రభుత్వం ఇలాంటి ఆంక్షలను విధించినట్లు తెలుస్తోంది. కేవలం ఇవే కావు మరో 19 అంశాల్లోనూ సౌదీ సర్కార్ ఆంక్షలను విధించింది. అయితే ఇప్పటివరకు కేవలం ముడి చమురుపైన్నే ఎక్కువగా ఆధారపడుతున్న సౌదీ పర్యాటక రంగం కూడా ఆదాయాన్ని కూడా ఆర్జించాలన్న ఆలోచనలో ఉంది. ఇందులో భాగంగానే పర్యాటక వీసాలకు మొదటిసారిగా పచ్చజెండా ఊపింది. అయితే కోవిడ్ మహమ్మారి కారణంగా పర్యాటక రంగం ప్రస్తుతం ఏ మాత్రం సరిగ్గాలేదు.

Dont Miss Reading These Articles

Leave a Reply

Morning Digestion Tips: మంచి జీర్ణక్రియ కోసం ఈ చిట్కాలను పాటించండి Bigg Boss Subhashree Rayaguru: మీకు తన గురించి ఈ విషయాలు తెలుసా? How To Boost Platelet Count: 10 సహజ మార్గాలు Food Tips: ఈ 10 ఆహార పదార్ధలు మీ ఫ్రిజ్ లో నిల్వచేయకండి India vs Pakistan Asia Cup: భారత్-పాకిస్థాన్ ఆసియా కప్ చరిత్ర
%d