కోవిడ్ మిగిల్చిన విషాదం…అన్నం దొరక్క ఆకలి కేకలు…ఈ దేశాల్లో పరిస్థితులు దారుణం…!

కోవిడ్ మహమ్మారి ఎన్నో దేశాలను తీవ్ర సంక్షోభానికి గురి చేసింది. వ్యాపార, వాణిజ్యాలను తీవ్రంగా దెబ్బతీసింది. అంతేకాదు విశ్వవ్యాప్తంగా అన్నార్థుల సంఖ్యను పెంచింది. కోవిడ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభం తీవ్రంగా పెరిగిందని తాజా నివేదికలు వెల్లడించాయి. ఈ మహమ్మారికి ప్రజల ఆదాయ మార్గాలు దెబ్బతిన్నాయి. దీంతో ఆకలితో అలమటించే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని అమెరికా అగ్రికల్చర్ విభాగం పేర్కొంది. ఆహార భద్రతలకు సంబంధించి 76దేశాలు, మధ్య స్వల్పదాయ దేశాల వార్షిక అంచనా 2021 యూఎస్ డిఏ తాజాగా విడుదల చేసింది. గతేడాది నుంచి ఈ దేశాల్లో అదనంగా 291 మిలియన్ల మందికి ఆహార కొరత ఏర్పడిందని అంచనా వేసింది. మొత్తం ఈ సంఖ్య 1.2బిలియన్లకు చేరింది. (120 కోట్లు)
2020లో ప్రపంచ ఆహార అభద్రత 15ఏళ్లో భారీస్థాయికి చేరుకుందని…ప్రపంచ జనాభలో పదవవంతు మంది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం లేదని ఐక్యరాజ్యసమితి ఈనెల ప్రారంభంలోనే తెలిపింది. 2021లో వస్తు సేవల ద్రవ్యోల్బణం, సప్లై చైయిన్ అంతరాయంగా కారణంతో ఆహార పదార్థాల ధరలు దశాబ్దంలో అత్యధిక స్ధాయికి చేరుకున్నాయి. దీంతో ఆహార ధాన్యాల దిగుమతులపై ఆధారపడిన పేద దేశాల పరిస్థితి 2021లో అత్యంత దారుణమైన పరిస్థితులను ఎదుర్కొనే ప్రమాదం ఉందని USDA అంచనా వేసింది.
ఇక ఇదే విషయంపై కొన్ని రోజుల క్రితం నేచర్ ఫుడ్ జర్నల్లో ఒక అధ్యయనం కూడా ప్రచురితమైంది. తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో తల్లులు, శిశువుల పోషకాహారం లోపంతో భవిష్యత్తులో ఉత్పాదక నష్టం 30 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని ఈ అధ్యయనం పేర్కొంది. ప్రధానంగా ఆసియా, ఆఫ్రికాలో వందల మిలియన్ల మందికి ఆకలి ఇబ్బందులు తలెత్తడం వల్ల రాజకీయ అస్థిరతను పెంచుతుందని స్పష్టం చేసింది. మొత్తానికి 76దేశాల్లో 1.2బిలియన్ ప్రజలపై ప్రభావం భారీగా పడిందని USDAరిపోర్టులో పేర్కొంది. ఇందులో ఈ ఏడాది 31శాతం జనాభా ఆహార అభద్రతకు గురవుతారు. కోవిడ్ విజ్రుంభణకు ముందు ఈ దేశాల్లో 761 మిలియన్ల మంది ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు.
జింబాబ్వే, కాంగో, యెమెన్ లాంటి దేశాల్లో చాలామంది ఆకలి బాధను అనుభవిస్తున్నారు. ఈ దేశాల్లో 80శాతానికి పైగా జనాభాకు సరిపోయో ఆహారం లభించడంలేదు. ఆహార అభద్రతకు ముఖ్య కారణం నిరంతర ఆధాయాలు తగ్గుదలేనని USDAరిపోర్టు వెల్లడించింది. రోజుకు కనీసం 2100కేలరీల ఆహారాన్ని తీసుకోనట్లయితే వారు ఆహార అభద్రతకు చేరువలో ఉన్నట్లు చెబుతున్నారు. ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉండటానికి కనీసస్థాయిగా దీన్ని పరిగణిస్తారు.