Dangerous: మాస్క్ వద్దన్నారు…కరోనా విలయతాండవం చేస్తోంది..ఎక్కడంటే

కోవిడ్ వైరస్ మహమ్మారి వ్యాప్తితో జీవితాలు అల్లకల్లోలం అయ్యాయి. నిబంధనలు, ఆంక్షల మధ్య రోజువారీ వ్యవహారాలను కూడా రద్దు చేసుకోవల్సిన పరిస్థితి దాపురించింది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇంటిగడప దాటాలంటే మాస్క్ తప్పనిసరని ప్రపంచ దేశాలు ఆదేశాలు జారీ చేశాయి. బయటకు ఎక్కడికి వెళ్లాలన్న మాస్క్ ధరిస్తే తప్ప ప్రవేశం ఉండదు. ఇలాంటి వివత్కర పరిస్థితుల నుంచి ఎప్పుడు గట్టెక్కుతామా అని ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో కొన్ని దేశాలు మాస్కు నిబంధనను ఎత్తివేసే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. మాస్క్ ధరించకుండా సాధారణ జీవితాన్ని గడిపేందుకు వెసులు బాటును కల్పిస్తున్నాయి. ఇలాంటి మినహాయింపు ఇచ్చిన మొదటి దేశంగా ఇజ్రాయెల్ నిలిచింది.
ఫేస్ మాస్కులు పెట్టుకోవడంలో మినహాయింపు ఇచ్చి సరిగ్గా వారం రోజులు గడిచింది. అంతే…దేశంలో మరోసారి కోవిడ్ వైరస్ స్వైరవిహారం చేసింది. ఇక్కడ మరో ముఖ్య విషయం ఏంటంటే..వ్యాక్సిన్ తీసుకున్నవారిలో చాలామందికి కరోనా సోకింది. జనాభాలో సగం వ్యాక్సిన్ వేసిన దేశాలలో ఇజ్రాయోల్ కూడా ఒకటి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ అన్ని కరోనా ఆంక్షలను తొలగించడంతోపాటు మాస్కులు పెట్టుకోవడంపై కూడా తప్పనిసరి కాదని ప్రకటించింది.
అయితే ఇజ్రాయెలో సోమవారం కొత్తగా 125 కొత్త కేసులు నమోదయ్యాయి. జనవరిలో కోవిడ్ వైరస్ వ్యాప్తి ఈ దేశంలో గరిష్టస్థాయికి చేరుకుంది. ఆ సమయంలో ఇజ్రాయెల్ లో ప్రతిరోజూ పదివేలకు పైగా కేసులు నమోదయ్యాయి. అయితే నెతన్యాహు సర్కార్ టీకాలు వేగవంతం చేయడం ద్వారా వైరస్ ను అడ్డుకోగలిగింది. అన్ని ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత పలు పాఠశాలల్లోని పిల్లలకు కోవిడ్ సోకింది. రెండు మోతాదుల టీకా తీసుకున్న 9మంది ఉపాధ్యాయులకు కూడా కోవిడ్ సోకింది. మొత్తంగా చూస్తే…ఇప్పటివరకు ఇజ్రాయెలో 8వేలకు పైగా మందికి కోవిడ్ సోకినట్లు నిర్దారణ అయ్యింది.