చైనాలో మొదటి బర్డ్ ఫ్లూ కేసు..ఏమైంది?

బర్డ్ ఫ్లూ ఎక్కడ సోకింది?
డ్రాగన్ కంట్రీలోని వుహాన్ లో వెలుగు చూసిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. తాజాగాన్ చైనాలో బర్డ్ ఫ్లూ మనిషికి సోకింది. ప్రపంచంలోనే తొలికేసుగా చైనా ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ దేశా ఆరోగ్య కమిషన్ మంగళవారం వెల్లడించింది.
ప్రపంచంలోనే తొలి కేసు ?
హెచ్10ఎన్3 స్ట్రెయిన్ వ్యాపించిందని ఆరోగ్య కమిషన్ తెలిపింది. ఈ కేసు నమోదు కాగానే వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. తూర్పు ప్రావిన్స్ లో జెన్ జియాంగ్ నగరానికి చెందిన 41ఏళ్ల వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకిందని ప్రకటించింది. ప్రపంచంలోనే తొలికేసు తమ దేశంలోనే నమోదైందంటూ కమిషన్ తన వెబ్ సైట్లో పేర్కొంది. సిడిసి వారం కింద పరీక్షలు నిర్వహించింది. ఆ వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకిందని ఫలితాల్లో నిర్ధారైనట్లుగా వెల్లడించింది.
బర్డ్ ఫ్లూపై జాతీయ ఆరోగ్య కమిషన్ ఏమంటోంది?
సదరు వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకిందని తేలడంతో వెంటనే వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ వ్యక్తికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ఆ వ్యక్తి ఎవర్నెవర్ని కలిసాడో వారిని గుర్తించి వైద్యులు పర్యవేక్షణలో ఉంచారు. అయితే బర్డ్ ఫ్లూ వ్యాప్తి తక్కువగా ఉంటుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాతీయ ఆరోగ్య కమిషన్ తెలిపింది.