27 ఏండ్ల వైవాహిక జీవితానికి ఎండ్ కార్డ్.. విడాకులు తీసుకుంటున్న‌ట్లు బిల్ గేట్స్ దంప‌తుల సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

27 ఏండ్ల వైవాహిక జీవితానికి ఎండ్ కార్డ్.. విడాకులు తీసుకుంటున్న‌ట్లు బిల్ గేట్స్ దంప‌తుల సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

మైక్రోసాప్ట్ అధినేత‌, ప్ర‌పంచ సంప‌న్నుడు బిల్ గేట్స్, త‌న భార్య మెలిండా గేట్స్.. త‌మ వివాహ బంధానికి స్వ‌స్తి ప‌లికారు. 27 ఏండ్లు క‌లిసి ఉన్న ఈ జంట.. విడాకులు తీసుకోబోతున్న‌ట్లు ప్ర‌క‌టించి ప్ర‌పంచాన్ని ఆశ్చ‌ర్యంలో ముంచారు. ఈ విష‌యాన్ని బిల్ గేట్స్ స్వ‌యంగా ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. బిల్ మెలిండా గేట్స్ ఫౌండేష‌న్ ద్వారా ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన ఈ దంప‌తుల ఎడ‌బాటు వార్త జ‌నాల‌ను షాక్ కు గురిచేసింది.

ఎన్నో చ‌ర్చ‌ల త‌ర్వాత త‌మ వివాహ బంధాన్ని తెంచుకోవాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు గేట్స్ తెలిపారు. 27 ఏండ్ల కాలంలో తాము ముగ్గురు మంచి పిల్ల‌ల‌ను త‌యారు చేశాం. ప్ర‌పంచంలో ప్ర‌తి ఒక్క‌రు ఆరోగ్యంగా త‌యార‌య్యేలా త‌మ ఫౌండేష‌న్ ద్వారా సేవ‌లు అందించామ‌న్నారు. ఈ సేవా కార్య‌క్ర‌మాలు ఇలాగే కొన‌సాగుతున్నాయ‌న్నారు. కానీ జీవితంలో తామిద్దరం ఇక క‌లిసి కొన‌సాగ‌లేమ‌న్నారు. కొత్త ప్ర‌పంచంలోకి వెళ్ల‌బోతున్న‌ట్లు చెప్పారు. మా వ్య‌క్తిగ‌త ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా, విడాకుల నిర్ణ‌యానికి ఆమోదం ప‌లుకుతున్న‌ట్లు గేట్స్ దంప‌తులు ప్ర‌క‌ట‌న చేశారు.

ఇప్పుడు బిల్‌గేట్స్‌ వయసు 65 ఏండ్లు కాగా, మిలిండా వ‌యసు 56 ఏండ్లు. మైక్రోసాఫ్ట్ సీఈవోగా ఉన్న స‌మ‌యంలో మిలిండా ప్రొడక్ష‌న్ మేనేజ‌ర్ గా ప‌నిచేశారు. ఇద్ద‌రూ తొలిసారి న్యూయార్క్ లో జ‌రిగిన పార్టీలో క‌లిశారు. అనంత‌రం ప్రేమ‌లో ప‌డ్డారు. జ‌న‌వ‌రి 1994ల‌లో వీరు హ‌వాయిలో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు జెన్నిఫర్ కాథరిన్ గేట్స్, రోరిజాన్‌ గేట్స్‌, ఫోబ్ అడిలె గేట్స్ అనే ముగ్గురు పిల్లలు పుట్టారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో గేట్స్‌ ఒకరు. గత ఫిబ్రవరి నాటికి ఆయన ఆస్తుల విలువ‌ 133 బిలియన్‌ డాలర్లు. 1987లో తొలిసారిగా ప్రపంచ సంపన్నుడిగా ఫోర్బ్‌ జాబితాలో స్థానం దక్కించుకున్నారు గేట్స్. 24 ఏళ్ల పాటు అదే ర్యాంకులో కొనసాగారు. ప్రస్తుతం బిల్‌గేట్స్‌ అత్యంత ధనవంతుల జాబితాలో నాలుగో ప్లేస్ లో ఉన్నారు.

బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్‌ బాధ్యతల నుంచి వైదొలిగాక.. 2000 సంవత్సరంలో బిల్‌, మెలిండా గేట్స్‌ ఫౌండేషన్ స్థాపించారు. ఇప్పటి వరకూ 54.8 బిలియన్‌ డాలర్లను ప్ర‌జా సేవ కోసం వినియోగించారు. ప్రజారోగ్యం, విద్య తదితర అంశాలపై దృష్టి సారించి ఎంతో మందికి చేయూత అందించారు. పర్యావరణ పరిరక్షణ, లింగ సమానత్వం, మహిళా సాధికారికత కోసం ఎంతో కృషి చేశారు. క‌రోనా వ్యాప్తి నేపథ్యంలో వ్యాక్సిన్‌ పరిశోధన, అభివృద్ధి కోసం ఈ ఫౌండేషన్‌ 1.75 బిలియన్‌ డాలర్లు అంద‌జేసింది.

Dont Miss Reading These Articles

Leave a Reply

Morning Digestion Tips: మంచి జీర్ణక్రియ కోసం ఈ చిట్కాలను పాటించండి Bigg Boss Subhashree Rayaguru: మీకు తన గురించి ఈ విషయాలు తెలుసా? How To Boost Platelet Count: 10 సహజ మార్గాలు Food Tips: ఈ 10 ఆహార పదార్ధలు మీ ఫ్రిజ్ లో నిల్వచేయకండి India vs Pakistan Asia Cup: భారత్-పాకిస్థాన్ ఆసియా కప్ చరిత్ర
%d