Today January 8th Horoscope : ఓ రాశివారికి ఈరోజు చాలా కీలకమైంది…అనవసర విషయాలతో కాలాన్ని వృథా చేయకండి.!!

ఈ రోజు రాశిఫలాలు ఈ విధంగా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు చాలా కీలకమైంది. అనవసర విషయాలతో కాలాన్ని వృథా చేయకూడదు. సాహసోపేతమైన విజయాలు ఉన్నాయి. రాశి చక్రంలోని 12 రాశులవారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది. ఎవరికీ కలిసి వస్తుంది…వారి అద్రుష్ట నక్షత్రాలు ఏం చెబుతున్నాయో…ఈ రోజు రాశిఫలాల్లో తెలుసుకుందాం.
మేషం
మిశ్రమ కాలం. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. కీలక విషయాల్లో శ్రద్ధను పెంచాలి. సందర్భానుసారంగా ముందుకు సాగండి. బంధు, మిత్రుల సలహాలు మేలైన ఫలితాన్ని ఇస్తాయి. మొహమాటంతో అనవసర ఖర్చులు పెరుగుతాయి. శివాలయ సందర్శనం మంచి ఫలితాన్ని
ఇస్తుంది
వృషభం
ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. చిత్తసౌఖ్యం ఉంది. అనవసర విషయాలతో కాలాన్ని వృథా చేయకండి. సాహసోపేతమైన విజయాలు
ఉన్నాయి. శివారాధన శుభకరం.
మిధునం
ప్రారంభించిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. అలసట చెందకుండా చూసుకోవాలి. బుద్ధిబలంతో విజయం సాధిస్తారు. కుటుంబసభ్యుల సహకారం ఉంది. దైవబలం రక్షిస్తోంది. ఇష్టదైవ సందర్శనం శుభప్రదం.
కర్కాటకం
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రారంభించబోయే పనుల్లో మంచి ఫలితాలు రాబడతారు. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. ఇష్టదైవాన్ని స్మరించండి.
సింహం
ప్రయత్నకాక ఉంది. శారీరక శ్రమపెరుగుతుంది. ప్రతిభతో విజయాలను అందుకుంటారు. విష్ణు నామస్మరణ మేలు చేస్తుంది.
కన్య
మీ మీ రంగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. అనుకూల ఫలితాలను సాధిస్తారు. ఒక ముఖ్యమైన సమస్యను చాకచక్యంగా పరిష్కరిస్తారు. గురువుల ఆశీర్వచనాలు మేలు చేస్తాయి.
తుల
‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అన్న వాక్యాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయాలి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కొన్ని విషయాలలో అనుకున్నదాని కంటే ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. సూర్య ఆరాధన మంచి ఫలితాలను ఇస్తుంది.
వృశ్చికం
బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో నుంచిబయటపడగలుగుతారు. బంధువుల సహకారం అందుతుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. ఇంట్లో గొడవలు జరిగే సూచనలు ఉన్నాయి. మీ ప్రతిష్టకు మచ్చ తెచ్చేందుకు కొందరు ప్రయత్నిస్తారు జాగ్రత్త. దైవారాధన మానవద్దు.
ధనుస్సు
మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా దైవానుగ్రహంతో వాటిని సమర్ధంగా ఎదుర్కొంటారు. క్రమంగా అభివృద్ధి సాధిస్తారు. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.
మకరం
ధర్మసిద్ధి ఉంది. ఏకాగ్రతతో పనిచేయండి అనుకున్నది సాధిస్తారు. ముఖ్య విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం అవసరం. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి.
కుంభం
ప్రారంభించిన పనులను తోటివారి సహకారంతో పూర్తిచేస్తారు. ఆటంకాలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. వాతావరణం ఉంటుంది. ఇష్టదేవత శ్లోకాన్ని చదవాలి.
మీనం
మనఃస్సౌఖ్యం ఉంది. మీ మీ రంగాల్లో మంచిపేరు సంపాదిస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆర్థికంగా ఎదుగుతారు. దుర్గాస్తుతి చదివితే
బాగుంటుంది.