Today Horoscope: 31-మే-2021ఈ రోజు రాశిఫలాలు…ఈరాశివారికి బాగా కలిసి వస్తుంది. నష్టాలన్నీ కూడా లాభాలుగా మారే అవకాశం ఉంది.

Today Horoscope: 31-మే-2021ఈ రోజు రాశిఫలాలు…ఈరాశివారికి బాగా కలిసి వస్తుంది. నష్టాలన్నీ కూడా లాభాలుగా మారే అవకాశం ఉంది.

31 మే 2021 దృగ్గణిత పంచాంగం
సూర్యోదయాస్తమయం : ఉ.05.34 / సా.06.36
దిన ప్రమాణం 13.03 ని. రాత్రి ప్రమాణం 10.57 ని.
సూర్యరాశి : వృషభ | చంద్రరాశి : మకరం/కుంభం

శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖమాసం కృష్ణ పక్షం
తిథి : షష్ఠి రా 01.05 ఆ తదుపరి సప్తమి
వారం : సోమవారం (ఇందువాసరే)
నక్షత్రం : శ్రవణం సా 04.02 ఆ పైన ధనిష్ఠ
యోగం : బ్రహ్మ ఉ 06.04 ఐంద్ర (01) తె 04.14
కరణం : గరిజ మ 01.33 వణిజ రా 01.05 ఆపై భద్ర


సాధారణ శుభసమయాలు
09.00 – 12.30 సా 04.00 – 05.00
అమృతకాలం : ఉ 05.55 – 07.28
అభిజిత్ కాలం : ప 11.39 – 12.31


అశుభసమయాలు
దు॥హుర్తం: మ 12.31 – 01.23 & 03.08 – 04.00
రాహు కాలం : ఉ 07.12 – 08.50
గుళిక కాలం : మ 01.43 – 03.21
యమ గండం : ఉ 10.27 – 12.05
ప్రయాణ శూల :‌ తూర్పు దిక్కు

మేషం
ఈ రోజు మీరు సంతోషంగా ఉంటారు. మీ నష్టాలన్నీ కూడా లాభాలుగా మారే ఛాన్స్ ఉంది. మీ సీనియర్లతో సంతోషంగా ఉంటారు. వారు మీ పనిని అభినందిస్తారు. ప్రమోషన్ల పరంగా, మీరున్న స్థలం లేదా పనిలో కొన్ని బాధ్యతలల మార్పులు చేసే అవకాశం ఉంది. మీ ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. బంధువులు లేదా స్నేహితుల సహాయంతో వివాహం విషయంలో సింగిల్స్, ప్రేమికులు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.

వృషభం
ఈరోజు మీకు చంద్రుని ఆశీర్వాదం లభిస్తుంది. మీ ఆరోగ్యం మీకు సహకరిస్తుంది. కుటుంబం లేదా స్నేహితులతో ఏదైనా ప్రార్థనమందిరానికి వెళ్లే అవకాశం ఉంది. కొంత మొత్తం ఏదైనా మత ప్రదేశానికి లేదా స్వచ్చంద సంస్థకు విరాళం ఇవ్వడానికి ప్లాన్ చేస్తారు. ఆస్తికి సంబంధించిన ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. మీరు చేస్తున్న పనికి సంబంధించి విదేశీ ప్రయాణానికి ప్లాన్ చేస్తారు.

మిథునం
ఈరోజు మీకు అంత అనుకూలంగా లేదు. ఎలాంటి వివాదాల్లో జోక్యం చేసుకోరాదు. కొందరు చేసే కుట్రలకు బలయ్యో అవకాశం ఉంది. క్లిష పరిస్థితుల నుంచి పెద్దల ఆశీర్వాదంతో మీరు బయట పడతారు. ప్రేమకు సంబంధించి ఎలాంటి వాదనలు చేయకుండా ఉండటమే మంచిది. రష్ డ్రైవింగ్ లేదా అడ్వెంచర్ టూర్ కు దూరంగా ఉండాలి.

కర్కాటకం
ఈరోజు సంతోషంగా ఉంటారు. మీ లక్ష్యాల వైపు మీ దృష్టి చాలా మంచిది. మీరు జీవిత భాగస్వామితో శృంగార క్షణాలు ఆస్వాదిస్తారు. మీ జీవిత భాగస్వామితో మీ బంధం మరింత బలంగా మారుతుంది. మీరు ఇతర సమస్యలతో కూడా బిజీగా ఉంటారు.

సింహం
ఈరోజు చాలా ఉత్సాహంగా ఉంటారు. పనిలో చక్కటి ప్రతిభను ప్రదర్శిస్తారు. సీనియర్లలతో మీ నిబంధనలను పెంచుతుంది. ప్రమోషన్ల పరంగా కొన్ని కొత్త బాధ్యతలను పొందే అవకాశం ఉంది. చట్టపరమైన విషయాలలో శుభవార్త వినే అవకాశం ఉంది. మీ ప్రత్యర్థులు, శత్రువులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. అనవసర విషయాల్లో తలదూర్చడం మంచిది కాదు.

కన్య
కష్టమైన పనిని చాలా తేలికగా పూర్తి చేస్తారు. ఇది మీ విశ్వాసాన్ని పెంచుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలను అర్జిస్తారు. పనికిరాని అంశాలపై వాదనలకు దూరంగా ఉండటం మంచిది. లేదంటే మీ విలువైన సమయాన్ని వృథా చేస్తుంది.

తుల
ఈరోజు అంతగా కలిసిరాకపోవచ్చు. మీ ప్రస్తుత పరిస్థితిపై మీరు అసంతృప్తి చెందవచ్చు. మీరు సహనంతో ఉండటం మంచిది. తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదు. మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలి.

వృశ్చికం
ఈ రోజు మీరు ఉత్సాహంగా ఉంటారు. మీ లక్ష్యాల వైపు మీ దృష్టిని మరల్చండి. మీరు మీ లక్ష్యాన్ని సులభంగా సాధిస్తారు. పని సంబంధిత ఇతర ప్రాంతాలకు ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఇది సమీప భవిష్యత్తులో మీకు ప్రయోజనాలను ఇస్తుంది. కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేయడంలో మీ సహచరులు,స్నేహితులు మీకు సహాయం చేస్తారు.

ధనుస్సు
ఈ రోజు మీకు బృహస్పతి చంద్రుని ఆశీర్వాదం లభిస్తుంది. మీ సామాజిక సేవల తరపున మీరు కొంత బహుమతులు పొందే అవకాశం ఉంది. మీ సీనియర్లు మిమ్మల్ని అభినందిస్తారు. ప్రమోషన్లు కూడా పొందే అవకాశం ఉంది. నష్టాలు ఇప్పుడు లాభాలుగా మారే ఛాన్స్ ఉంది. వ్యాపారంలో మీ స్ధాయిని పెంచుతుది. మీ కుటుంబానికి సంబంధించిన వ్యాపారంలో ఎక్కువ పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తారు. ఇది భవిష్యత్తులో మంచి లాభాలను చేకూరుస్తుంది.

మకరం
ఈరోజు సంతోషంగా ఉంటారు. మీ ఆరోగ్యం మీకు సహకరిస్తుంది. మీకు అంతర్గత బలంతోపాటు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. మీ ప్రతిష్టను నిలబెట్టుకునేందుకు ప్రయత్నం చేస్తారు. గజిబిజి పనిని మార్చేందుకు ప్రయత్నిస్తారు. మీ సామాజిక ప్రతిష్ట పెరిగే అవకాశం ఉంది.

కుంభం
ఈరోజు మీరు నిరాశ చెందే అవకాశం ఉంది. మీ అహంకారాన్ని తగ్గించుకోవడం మంచిది. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉంటడం మంచిది. లేదంటే ఇబ్బందులను ఎదుర్కొవల్సి ఉంటుంది. ప్రేమికులు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే విడిపోయో ప్రమాదం ఉంది.

మీనం
ఈరోజు మనశ్శాంతిగా ఉంటారు. వ్యాపారంలో కొంత పెట్టుబడి పెట్టేందుకు ప్లాన్ చేస్తారు. ఇది మీ వ్యాపారం ఎదుగుదలకు సహాయపడుతుంది. మీ జీవిత భాగస్వామితో శృంగార క్షణాలు ఆనందించవచ్చు.ఇది కుటుంబ జీవితంలో సామరస్యాన్ని పెంచుతుంది. సింగిల్స్ తగిన మ్యాచ్‌ను ఎంచుకునే అవకాశం ఉంది. ప్రేమికులు వివాహం చేసుకోవటానికి నిర్ణయం తీసుకుంటారు.

Dont Miss Reading These Articles

Leave a Reply

Morning Digestion Tips: మంచి జీర్ణక్రియ కోసం ఈ చిట్కాలను పాటించండి Bigg Boss Subhashree Rayaguru: మీకు తన గురించి ఈ విషయాలు తెలుసా? How To Boost Platelet Count: 10 సహజ మార్గాలు Food Tips: ఈ 10 ఆహార పదార్ధలు మీ ఫ్రిజ్ లో నిల్వచేయకండి India vs Pakistan Asia Cup: భారత్-పాకిస్థాన్ ఆసియా కప్ చరిత్ర
%d