Today Horoscope: 28-మే-2021 ఈరోజు రాశిఫలాలు. ఈరాశివారు ఆధ్యాత్మికవైపు మొగ్గు చూపుతారు. నష్టాలన్నీ కూడా లాభాలుగా మారుతాయి.

Today Horoscope: 28-మే-2021 ఈరోజు రాశిఫలాలు. ఈరాశివారు ఆధ్యాత్మికవైపు మొగ్గు చూపుతారు. నష్టాలన్నీ కూడా లాభాలుగా మారుతాయి.

28 మే 2021 దృగ్గణిత పంచాంగం
సూర్యోదయాస్తమయం : ఉ.05.34 / సా.06.35
దిన ప్రమాణం 13.02 ని. రాత్రి ప్రమాణం 10.58 ని.
సూర్యరాశి : వృషభ | చంద్రరాశి : ధనస్సు

శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖమాసం కృష్ణ పక్షం
తిథి : విదియ ఉ 09.36 తదుపరి తదియ
వారం : శుక్రవారం (భృగువాసరే)
నక్షత్రం : మూల ఉ 08.02 ఆ పైన పూర్వాషాఢ
యోగం : సాధ్య మ 02.58 ఆపైన శైభ
కరణం : గరిజ ఉ 09.36 వణిజ రా 08.01 ఆపైన భద్ర


సాధారణ శుభసమయాలు
09.15 – 10.15 సా 05.00 – 06.30
అమృతకాలం : మ 02.18 – 03.44
అభిజిత్ కాలం : ప 11.39 – 12.3

అశుభసమయాలు
వర్జ్యం : సా 06.36 – 08.02 & రా.తె (29) 04.51 ల నుండి
దు॥హుర్తం : ఉ 08.10 – 09.03 మ 12.31 – 01.23
రాహు కాలం : ఉ 10.27 – 12.05
గుళిక కాలం : ఉ 07.12 – 08.49
యమ గండం : మ 03.20 – 04.58
ప్రయాణ శూల :‌ పడమర దిక్కు

మేషం
ఈరోజు మిమ్మల్ని ఆధ్యాత్మిక శక్తి సంతోషపరుస్తుంది. మీ ఆలోచనా విధానం మారుతుంది. ఆధ్యాత్మికతకు మొగ్గు చూపుతారు. ఏదో ఒక ప్రార్థనమందిరాన్ని సందర్శించేందుకు ప్లాన్ చేస్తారు. క్షుద్రశాస్త్రంపై కూడా ఆసక్తి చూపిస్తారు. మీ అభిప్రాయాలు ఇతరులతో చర్చించకుండా ఉండటం మంచిది. మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తితో మీ అభిప్రాయాలను పంచుకోండి.

వృషభం
ఈరోజు మీరు నీరసంగా ఉంటారు. సహనం ఉండదు. శాంతిని కోరుకునేందుకు దేవాలయాలను సందర్శిస్తారు. మీ ఆత్మసాక్షిని నమ్ముతు ముందుకు వెళ్లడం మంచిది. ఇతర అంశాలపై లోతైన జ్ఞానాన్నిపొందుతారు.

మిథునం
ఈరోజు చంద్రుడు మీకు అనుకూలంగా ఉంటారు. ఉద్యోగంలో కుటుంబ జీవితంతో సంతోషంగా గడుపుతారు. పెట్టుబడుల పరంగా లాభాలను ఆశిస్తారు. స్నేహితులు, బంధువులను నుంచి సహాయాన్ని అందిపుచ్చుకుంటారు.

కర్కాటకం
ఈరోజు మీకు కలిసి వస్తుంది. మీ పిల్లల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వారి భవిష్యత్తు కోసం కొన్ని పెట్టుబడులు పెట్టేందుకు ప్లాన్ చేస్తారు. మీ ఉద్యోగం పట్ల మరింత బాధ్యతగా ఉంటారు. మంచి ఉద్యోగాన్ని పొందే చాన్స్ ఉంది. అనవసరపు విషయాల్లో తలదూర్చడం మంచిది కాదు.

సింహం
ఈరోజు మీ ఉద్యోగానికి సంబంధించి శుభవార్త వింటారు. ఉద్యోగులు ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది. ఇది మీ ప్రమోషన్ కు సహాయపడుతుంది. పిల్లల కోసం పరితపిస్తున్న దంపతులు ఈరోజు కొన్ని శుభవార్తలు వింటారు.

కన్య
ఈరోజు మీరున్న స్థలాన్ని మార్చేందుకు ప్లాన్ చేస్తాను . ఇతర ప్రాంతానికి వెళ్లేందుకు నిర్ణయం వాయిదా వేసుకోవడం మంచిది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టకపోవడమే శ్రేయస్కరం. సాయంత్రం వరకు పరిస్థితి అంతా కూడా అదుపులోకి వస్తుంది. పెద్దల సహాయంతో గజిబిజి పరిస్థితుల నుంచి బయట పడతారు.

తుల
ఈరోజు మీరు వ్యాపారానికి సంబంధించి టూర్ వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. మీ విజయానికి ప్రతిఫలంగా బహుమతులు పొందుతారు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. తోబుట్టువుల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. ఉద్యోగార్థులు విజయం సాధిస్తారు.

వృశ్చికం
ఈరోజు మీకు పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. బ్యాంక్ బ్యాలెన్స్ రెట్టింపు అయ్యే కొత్త ఆదాయ వనరులను కొనుగొంటారు. మీ ఇంట్లో చిన్న చిన్న పనులు చేసేందుకు ప్లాన్ చేస్తారు. ఏదైనా ఒప్పందంపై సంతకం చేసే ముందు ఒకటిరెండు సార్లు ఆలోచించడం మంచిది. మీ వ్యాపారం ముందుకు సాగుతుంది. ఆలస్యమైన ప్రాజెక్టులు తిరిగి ప్రారంభమవుతాయి.

ధనుస్సు
ఈరోజు మీకు అన్ని విధాల కలిసి వస్తుంది. శక్తితోపాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది. పనిని ఇస్టంగా పూర్తిచేస్తారు. పనికిరాని అంశాలపై వాధించడం మానుకోవడం మంచిది. లేదంటే మీ కుటుంబంలో కొన్ని వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రేమికులు అనవసరపు అంశాలపై చర్చించకుండా ఉండటం మంచిది.

మకరం
ఈరోజు మీరు నీరసంగా ఉంటారు. గతంలో వచ్చిన వ్యాధి మళ్లీ తిరగబడుతుండటంతో తీవ్రంగా కలవరపడుతారు. అడ్వెంచర్ టూర్స్ లేదా రష్ డ్రైవింగ్ మానుకోవడం మంచిది. విదేశీ పర్యటన కోసం ప్లాన్ చేస్తారు.

కుంభం
గతంలో పెట్టిన పెట్టుబడులన్నింటిలోనూ లాభాలను పొందుతారు. నష్టాలన్నీ కూడా లాభాలుగా మారే అవకాశం ఉంది. కొత్త ఆలోచనలతో వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఇందులో సులభంగా విజయాన్ని సాధిస్తారు. కొంతమంది గొప్పవ్యక్తులను కలుసుకునే అవకాశం వస్తుంది. ప్రేమికులు వివాహం విషయానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. పిల్లల కోసం ఆలోచిస్తున్న జంటలు శుభవార్త వింటారు.

మీనం
ఈరోజు మీ కుటుంబంతోపాటు..మీ జీవితభాగస్వామి కూడా మీకు అనుకూలంగా ఉంటారు. ఇది మీ మధ్య సామరస్యాన్ని పెంచుతుంది. పని ఒత్తిడి కారణంగా కుటుంబానికి సమయాన్ని ఎక్కువగా కేటాయించలేకపోతారు. పెండింగ్ లో ఉన్న ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన ప్రాజెక్టులన్నీ కూడా తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Dont Miss Reading These Articles

Leave a Reply

Morning Digestion Tips: మంచి జీర్ణక్రియ కోసం ఈ చిట్కాలను పాటించండి Bigg Boss Subhashree Rayaguru: మీకు తన గురించి ఈ విషయాలు తెలుసా? How To Boost Platelet Count: 10 సహజ మార్గాలు Food Tips: ఈ 10 ఆహార పదార్ధలు మీ ఫ్రిజ్ లో నిల్వచేయకండి India vs Pakistan Asia Cup: భారత్-పాకిస్థాన్ ఆసియా కప్ చరిత్ర
%d bloggers like this: