Today Horoscope: 26-మే-2021 ఈ రాశివారు అనారోగ్యానికి గురవుతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు వాయిదా వేసుకోవడం మంచిది.

Today Horoscope: 26-మే-2021 ఈ రాశివారు అనారోగ్యానికి గురవుతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు వాయిదా వేసుకోవడం మంచిది.

26 మే 2021 దృగ్గణిత పంచాంగం
సూర్యోదయాస్తమయం : ఉ.05.35 / సా.06.35
దిన ప్రమాణం13.01 ని రాత్రి ప్రమాణం 10.59 ని
సూర్యరాశి : వృషభ | చంద్రరాశి : వృశ్చికం

తిథి : పౌర్ణమి సా 04.43 ఆపైన బహుళ పాడ్యమి
వారం : బుధవారం (సౌమ్య వాసరే)
నక్షత్రం : అనూరాధ రా 01.16 ఆపైన జ్యేష్ఠ
యోగం : శివ రా 10.52 ఆపైన సిద్ధి
కరణం : భద్ర ఉ 06.36 బవ సా 04.43 బాలవ రా 02.51 ఆపైన కౌలవ

సాధారణ శుభసమయాలు
09.00 – 11.00 01.30 – 05.30 సా
అమృతకాలం : సా 04.08 – 05.32
అభిజిత్ కాలం : ఈరోజు లేదు

అశుభసమయాలు
వర్జ్యం : ఉ 07.42 – 09.06
దు॥హుర్తం : ప 11.39 – 12.31
రాహు కాలం : మ 12.05 – 01.42
గుళిక కాలం : ఉ 10.27 – 12.05
యమ గండం : ఉ 07.12 – 08.49
ప్రయాణ శూల :‌ ఉత్తర దిక్కు

మేషం
ఈరోజు మీకు నీరసంగా ఉంటుంది. కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు. వ్యాపారంలో పెట్టుబడులు కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం మంచిది. కొత్త వెంచర్ కూడా ప్రారంభించకపోవడం ఉత్తమం. వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉంది.

వృషభం
ఈరోజు మీకు కలిసి వస్తుంది. సంతోషంగా గడుపుతారు. మీ వ్రుత్తి పనికి సంబంధించి కొంతమంది వ్యక్తులను కలిసే అవకాశం ఉంది. మీ ఉద్యోగంలో మంచి పనితీరు కనబరుస్తారు. ప్రమోషన్ల పరంగా కొంత బహుమతులు ఆశిస్తారు. వారసత్వంగా వచ్చిన ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది.

మిథునం
ఈరోజు మీకు ఆరోగ్యం సహకరిస్తుంది. మీ లక్ష్యాల వైపు దృష్టి సారిస్తారు. మీరు అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి. యజమాని మీతో సంతోషంగా ఉంటారు. పనిలో కొన్ని ముఖ్యమైన బాధ్యతలు ఉంటాయి. ఏదైనా చట్టపరమైన విషయాల్లో మీకు శుభవార్త వినిపిస్తుంది. ప్రత్యర్థులు, వ్యాపార ప్రత్యర్థులపై నియంత్రణ సాధిస్తారు.

కర్కాటకం
ఈరోజు మీరు చాలా విషయాలను నేర్చుకుంటారు. మేధో సంపత్తి విలువను అర్ధం చేసుకుంటారు. కొన్నిసార్లు సహానాన్ని కోల్పోతారు. మీరు తలపెట్టిన పని సజావుగా జరుగుతుంది. ఆస్తులకు సంబంధించి కొత్త పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ ప్రియమైన వారికోసం కొంత డబ్బు ఖర్చు చేస్తారు. ప్రేమికులు సంతోషకరమైన క్షణాలను ఆస్వాదిస్తారు.

సింహం
ఈ రోజు మీరు అసంతృప్తిగా ఉంటారు. మీ బాధ్యతల కోసం మీకు ఒక విధమైన నిర్లిప్తత ఉంది. ఇది మిమ్మల్ని గందరగోళానికి గురి చేస్తుంది. మీరు మీ ప్రాజెక్టుల ప్లాన్ చేయవచ్చు. మీ పనిని సకాలంలో పూర్తి చేయడానికి మీరు ఆచరణాత్మకంగా ఉండటం మంచిది. ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నట్లయితే…దానిని కొన్ని రోజులపాటు వాయిదా వేయడం మంచిది.

కన్య
ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రొఫెషనల్ మరియు డొమెస్టిక్ ఫ్రంట్‌లో మీ కృషిని విజయవంతం చేస్తారు. పనిని సమయానికి పూర్తి చేయవచ్చు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మెరుగుపరుస్తుంది. మీరు పనికి సంబంధించిన కొన్ని చిన్న యాత్రలు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. ఇది మీ నెట్‌వర్క్ పరంగా సమీప భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటుంది.

తుల
ఈ రోజు మీరు కొన్ని పనులతో బిజీగా ఉండవచ్చు. మీరు కొన్ని కళాఖండాలు లేదా ఇంటి అలంకరణ కోసం కొన్ని వస్తువులను కొనడానికి డబ్బు ఖర్చు చేయవచ్చు. పనికిరాని వస్తువులపై ఖర్చులను నియంత్రించడం మంచిది. లేకుంటే అది ఇంట్లో ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. మీ చుట్టుపక్కల వ్యక్తులతో మీరు కఠినంగా మాట్లాడకపోవడం మంచిది.

వృశ్చికం
ఈ రోజు గందరగోళ పరిస్థితి నుంచి ప్రశాంతంగా ఉంటారు. వ్యాపారంలో కొన్ని నిర్ణయాలు తీసుకునేందుకు మీ తల్లిదండ్రుల సలహా తీసుకుంటారు. ఇది మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తుంది. కొంతమంది పేదలకు మీరు సహాయసహాకారాలు అందిస్తారు. ఇది మీ సామాజిక గౌరవాన్ని పెంచుతుంది. విద్యార్థులు తమ కెరీర్ కు సంబంధించి ఒక నిర్ణయానికి వస్తారు.

ధనుస్సు
ఈరోజు కొన్ని ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని వెంటాడుతాయి. ఇవి మిమ్మల్ని అసహానానికి గురి చేస్తుంది. కష్టపడి సంపాదించిన డబ్బు పనికిరాని వస్తువులపై ఖర్చు చేస్తారు. ఇది మీ పొదుపుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ప్రేమికులు పనికిరాని అంశాలపై చర్చించకపోవడం మంచిది. లేదంటే దూరమయ్యే ప్రమాదం ఉంది.

మకరం
ఈరోజు కొంతమంది ప్రభావవంతమైన వ్యక్తులను కలిసే ఛాన్స్ ఉంది. వారు మీ పనికి సహాయపడుతారు. వ్యాపారానికి సంబంధించి కొత్త ఆలోచనలు అమలు చేసేందుకు సిద్ధంగా ఉంటారు. వ్యాపారంలో ఎక్కువగా పెట్టుబడులు పెట్టేందుకు ప్లాన్ చేస్తారు. భవిష్యత్తులో మీకు ఆర్థిక లాభాలను ఇస్తుంది. గృహ జీవితం పరంగా, కుటుంబ సమిష్టి మరియు సామాజిక సంఘటనలలో బిజీగా ఉంటారు.

కుంభం
ఈరోజు మీరు ఆరోగ్యంగా ఉంటారు. పనిని ఆనందిస్తారు. మీరు చేసిన కృషికి బహుమతులు లభిస్తాయి. మీ సామాజిక గౌరవం ఇప్పుడు పెరుగుతుంది. అధిక పని మిమ్మల్ని అలసిపోయోలా చేస్తుంది. పనిభారం కారణంగా మీ కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోతారు.

మీనం
ఈ రోజు మీరు పనిలో సంతృప్తి చెందవచ్చు. పని సంబంధిత యాత్ర కోసం ప్లాన్ చేస్తారు. మీ అంతర్గత శాంతిని కాపాడటానికి మీరు కొన్నిమతపరమైన మందిరాలను కూడా సందర్శించవచ్చు. మీ గురువులు మీకు సరైన మార్గాన్ని చూపిస్తారు. ఇది మీ లక్ష్యాలకు సంబంధించి మీకు స్పష్టత ఇస్తుంది.

Dont Miss Reading These Articles

Leave a Reply

Morning Digestion Tips: మంచి జీర్ణక్రియ కోసం ఈ చిట్కాలను పాటించండి Bigg Boss Subhashree Rayaguru: మీకు తన గురించి ఈ విషయాలు తెలుసా? How To Boost Platelet Count: 10 సహజ మార్గాలు Food Tips: ఈ 10 ఆహార పదార్ధలు మీ ఫ్రిజ్ లో నిల్వచేయకండి India vs Pakistan Asia Cup: భారత్-పాకిస్థాన్ ఆసియా కప్ చరిత్ర
%d