Today Telugu Horoscope: 04-జూన్-2021 శుక్రవారం రాశిఫలాలు.

04 జూన్ 2021* దృగ్గణిత పంచాంగం
సూర్యోదయాస్తమయం : ఉ.05.34 / సా.06.38
దిన ప్రమాణం 13.04 ని. రాత్రి ప్రమాణం 10.56 ని.
సూర్యరాశి : వృషభ | చంద్రరాశి : మీనం
హనుమత్ జయంతి శుభాకాంక్షలు
శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖమాసం కృష్ణ పక్షం
తిథి : దశమి రా.తె (05) 04.07 ఆపై ఏకాదశి
వారం : శుక్రవారం (భృగువాసరే)
నక్షత్రం : ఉ॥భాద్ర రా 08.47 ఆ పైన రేవతి
యోగం : ఆయుష్మాన్ రా 02.50 ఆపైన సౌభాగ్య
కరణం : వణిజ మ 03.10, భద్ర రా.తె (05) 04.07 ఆపైన బవ
సాధారణ శుభసమయాలు
ఉ* 06.00 – 07.30 సా 05.00 – 07.30
అమృతకాలం : మ 03.33 – 05.18
అభిజిత్ కాలం : ప 11.40 – 12.32
అశుభసమయాలు
వర్జ్యం : శేషం ఉ 06.49 వరకు
దు॥హుర్తం: ఉ 08.11 – 09.03 మ 12.32 – 01.24
రాహు కాలం : ఉ 10.28 – 12.06
గుళిక కాలం : ఉ 07.12 – 08.50
యమ గండం : మ 03.22 – 05.00
ప్రయాణ శూల : పడమర దిక్కు
మేషం
ఈరోజు చంద్రుని ఆశీర్వాదం ఉంటుంది. సంతోషంగా గడుపుతారు. పేదలకు సాయం చేస్తారు. మీ వ్యక్తిగత జీవితంలో జరిగిన తప్పులను విశ్లేషించుకోవడంతో పాటు తప్పులను అంగీకరిస్తారు. జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. భాగస్వాముల మధ్య ఏర్పడిన వివాదాలు పరిష్కారమవుతాయి.
వృషభం
ఆరోజు మీరు ఆరోగ్యంగా ఉంటారు. గతకాలపు అనారోగ్య సమస్యలన్నీ కూడా నయమవుతాయి. కొంత వ్యాజ్యాన్ని గెలుచుకునే అవకాశం ఉంది. అనవసరపు విషయాల్లో తలదూర్చకండి. ప్రత్యర్థులపై మీకు పూర్తి నియంత్రణ ఉండాలి. లేదంటే కొన్ని విషయాల్లో ఇరుక్కుపోయి డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంది. మీరు నిర్వహిస్తున్న పనిలో కొత్త బాధ్యతలను పొందుతారు. సమీప భవిష్యత్తులో మీకు ప్రయోజనాలు చేకూరుతాయి.
మిథునం
ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ పిల్లల సమస్యలతో బిజీగా గడుపుతారు. కొత్త జంటలను బిడ్డను స్వాగతిస్తారు. కొన్ని శుభవార్తలు వింటారు. మీ వ్యాపారం, సామాజిక జీవితంలో వివాదాలు పరిష్కారం అవుతాయి. విద్యార్థులు విదేశీ విద్యా కోసం ప్లాన్ చేస్తారు. ఉద్యోగం చేస్తూ…ఉన్నత చదువుల కోసం ప్లాన్ చేసుకోవడం మంచిది.
కర్కాటకం
మీరు చేస్తున్న పనిలో నిరాశ ఎదురైతుంది. సంతోషకరమైన క్షణాలను ఆస్వాదించలేరు. ఆస్తి విషయాల్లో కొన్ని నష్టాలను ఎదుర్కొంటారు. పెట్టుబడులను కొంత కాలం వాయిదా వేయడం మంచిది. లేదంటే నష్టాలను ఎదుర్కోవల్సి వస్తుంది. మీ తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.
సింహం
ఈరోజు మీకు చంద్రుని ఆశీర్వాదం లభిస్తుంది. అంతర్గత బలం ఉంటుంది. పనిలో కొన్ని కష్టమైన నిర్ణయాలను తీసుకుంటారు. ఈరోజు కొంత సమయం సమాజానికి కేటాయిస్తారు. బిజీగా ఉంటారు. మీ నెట్ వర్క్ విస్తురిస్తుంది. సమీప భవిష్యత్తులో ప్రయోజనాన్ని ఇస్తాయి. తోబుట్టువులతో ఆస్తి సంబంధిత వివాదాలు పరిష్కరమవుతాయి.
కన్య
మీ కుటుంబంతో ఈరోజు సంతోషంగా, బిజీగా గడుపుతారు. పిల్లల చదువు గురించి ప్లాన్ చేస్తారు. ఇంటిని పునరుద్దరించడానికి కొన్ని కళాఖండాలు మరియు సృజనాత్మక వస్తువులను కొనడానికి డబ్బును ఖర్చు చేస్తారు. ఉన్నత చదువుల కోసం పిల్లలు విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. అది మిమ్మల్ని కలవరపెడుతుంది. ఇతర వ్యసనాలన్నీ కూడా దూరంగా పెట్టడం మంచిది. లేదంటే జీవితంలో ఎన్నో అవాంతరాలను ఎదుర్కోవల్సి వస్తుంది.
తుల
ఈరోజు చంద్రుని ఆశీర్వాదం లభిస్తుంది. ధైర్యంతో మంచి ప్రణాళికలు వేయగలుగుతారు. వాటిని సమర్థవంతంగా అమలు చేసే అవకాశం ఉంది. ఏ విషయంలోనూ అతిగా ప్రవర్తించడాన్ని మానుకోండి. కొన్ని విషయాల్లో పొరపాటు చేసే అవకాశం ఉంది. ఏదైనా పత్రాలపై సంతకాలు చేసే ముందు పత్రాలను చదవి నిర్ణయం తీసుకోండి.
వృశ్చికం
ఆరోగ్య సమస్యలను మిమ్మల్ని తీవ్రంగా బాధపెడతాయి. ఆందోళన చెందుతారు. మీ లక్ష్యాల వైపు దృష్టి పెట్టలేకపోతారు. పనికిరాని పనులు చేయడంలో మీ విలువైన సమయాన్ని వృథా చేస్తారు. పనికిరాని వస్తువులపై ఖర్చును నియంత్రించడం మంచిది. లేదంటే మీ ఆర్థిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
ధనుస్సు
ఈరోజు మీకు అంతగా కలిసి రాదు. మీరు చేస్తున్న పనిపై దృష్టి సారించలేకపోతారు. కానీ పెద్దల ఆశీర్వాదం సహాయంతో గజిబిజి పరిస్థితి నుంచి బయటపడతారు. మీకు కావాల్సిన వనరులను సులభంగా సమకూర్చుకుంటారు. మీ ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉంది. మీ నష్టాలు లాభాలుగా మారుతాయి. మీ ఆర్థిక ఆరోగ్యం మెరుగవుతుంది.
మకరం
ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. విదేశీ క్లయింట్ నుంచి ఆర్డర్ లను పొందుతారు. వ్యాపారంలో మీ ద్రవ్యతను పెంచుతుంది. వ్యాపారాన్ని పెంచుకోవడంలో సహాయపడే కొంతమంది ప్రభావవంతమైన వ్యక్తలను కలిసే అవకాశం ఉంది. యజమానితో మీ బంధం బలంగా మారుతుంది. కష్టపడి పనిచేయడం వల్ల కొన్ని ప్రమోషన్లను ఆశిస్తారు. ఇది మీ ప్రతిష్టను పెంచుతుంది.
కుంభం
ఈరోజు మీకు పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. మీ ఆలోచనా విధానం సహానాన్ని ఇస్తుంది. సంతోషంగా ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది. మనశ్శాంతి కోసం ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లడం మంచిది. మీరు అభివృద్ధి కోసం కొంత మొత్తాన్ని ఆధ్యాత్మిక ప్రదేశానికి కూడా విరాళంగా ఇవ్వవచ్చు.
మీనం
ఈ రోజు మీకు నీరసంగా అనిపించవచ్చు. మీకు కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఉండవచ్చు.ఇది మీ రోజు పనిని ప్రభావితం చేసే అవకాశం ఉంది. రష్ డ్రైవింగ్ మరియు అడ్వెంచర్ టూర్లను నివారించడం మంచిది. మీరు క్షుద్ర ద్వారా కూడా ఆకర్షితులవుతారు. మీరు ఏదో ఒక మత స్థలాన్ని సందర్శించడం వల్ల మనస్సు తేలికగా ఉంటుంది.