Horoscope 02-08-2021: ఈరోజు రాశిఫలాలు: ఈ రాశివారు చాలా ఇబ్బందులను ఎదుర్కోవల్సి ఉంటుంది. మిథున రాశివారికి కలిసివస్తుంది…ఆ రెండు రాశులవారు జాగ్రత్తగా ఉండాలి.

Horoscope 02-08-2021: ఈరోజు రాశిఫలాలు: ఈ రాశివారు చాలా ఇబ్బందులను ఎదుర్కోవల్సి ఉంటుంది. మిథున రాశివారికి కలిసివస్తుంది…ఆ రెండు రాశులవారు జాగ్రత్తగా ఉండాలి.
Source: Freepik

Today Horoscope: గ్రహాలు, తిథి, నక్షత్రం వంటి పలు అంశాల ఆధారంగా రాశిఫలాలను నిర్దేశిస్తారు. ఇవి ప్రతిరోజూ మారుతుంటాయి. గ్రహాలు ఏ రాశి క్షేత్రంలో తిరుగుతాయో వాటి ఆధారంగా…రాశిఫలాలపై మంచి, చెడు ఫలితాలు ఉంటాయి. ఏది జరిగినా అప్రమత్తంగా ఉండాలి.
మరి 02-08-2021 రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

02 ఆగస్ట్ 2021* దృగ్గణిత పంచాంగం
సూర్యోదయాస్తమయం : ఉ.05.48/సా.06.39
సూర్యరాశి : కర్కాటకం | చంద్రరాశి : వృషభం

శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం బహుళ పక్షం*
తిథి : నవమి ఉ 10.27 ఆ తదుపరి దశమి
వారం : సోమవారం (ఇందువాసరే)
నక్షత్రం : కృత్తిక రా 10.44 తదుపరి రోహిణి
యోగం : వృద్ధి రా 11.07 తదుపరి ధృవ
కరణం : గరిజ ఉ 10.27 వణిజ రా 11.44 ఆపైన భద్ర


సాధారణ శుభసమయాలు
సా 04.30 – 05.30
అమృతకాలం : రా 08.01 – 09.09
అభిజిత్ కాలం : ప 11.48 – 12.39


అశుభసమయాలు
వర్జ్యం : ఉ 09.10 – 10.58
దు॥హుర్తం: మ 12.39 – 01.31 & 03.13 – 04.05
రాహు కాలం : ఉ 07.25 – 09.01
గుళిక కాలం : మ 01.50 – 03.26
యమ గండం : ఉ 10.37 – 12.14
ప్రయాణ శూల :‌ తూర్పు దిక్కు

మేషం
మేషరాశి వారికి ఈరోజు వ్యయం తగ్గి పొదుపు పెరుగుతుంది. ఈరోజు మరింత ఉషారుగా ఉంటారు. మీ సామాజిక స్థితి మెరుగుపడుతుంది. ప్రేమికులు వివాహం విషయంలో వారి కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. విద్యార్థులు చదువు విషయంలో శుభవార్త వింటారు.

వృషభం
ఈ రోజు ఈ రాశివారికి సంకల్ప శక్తి పని విషక్ష్ంలో కొన్ని కొత్త ఆవిష్కరణలను ప్రారంభించడానికి ఉపయోగపడుతుంది. వ్యాపారంలో మంచి ఆఫర్లను పొందుతారు. భవిష్యత్తులో వ్యాపారంలో వ్రుద్ధి సాధిస్తారు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. దీంతో మీరు మరింత బిజీగా మారుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఇది కుటుంబంలో సామరస్యాన్ని పెంచుతుంది.

మిథునం
మిథున రాశివారు ఈరోజు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. కష్టపడి సంపాదించిన డబ్బు కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేసేందుకు ఖర్చు చేస్తారు. మీ స్వభావాన్ని మార్చుకోవడం మంచిది. ప్రేమికులు పనికిరాని విషయాలపై అనవసర చర్చలు చేయవద్దు. లేదంటే పరిస్థితులు తారుమారు అయ్యే అవకాశం ఉంది.

కర్కాటకం
కర్కాటక రాశివారు ఇవాళ కొంతమంది ప్రభావవంతమైన వ్యక్తులను కలుస్తారు. ఆ వ్యక్తుల సహాయంతో మీకు నెట్ వర్క్ మరింత బలంగా ఉంటుంది. పని లేదా వ్యాపారంలో కొత్త ఆలోచనలను అమలు చేస్తారు. వ్యాపారంలో ఎక్కువగా మూలధనాన్ని పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంటారు. సమీప భవిష్యత్తులో మీకు ఆర్థిక లాభాలను పొందుతారు. సామాజిక కార్యక్రమాల్లో బిజీగా గడుపుతారు.

సింహం:
ఈరాశివారికి ఈరోజు అంతగా కలిసిరాదు. తల్లిదండ్రులు ఆరోగ్యం కలవరపెడుతుంది. కష్టానికి ఫలితాన్ని ఆర్జిస్తారు. సామాజిక గౌరవం పెరుగుతుంది. అధిక పని అలసిపోయేలా చేస్తుంది. అధిక పనిభారం వల్ల కొన్ని కుటుంబ కార్యక్రమాలను చేయలేకపోతారు.

కన్య
ఈ రోజు మీరు పనిలో సంతృప్తి చెందవచ్చు. ఒక చిన్న పని సంబంధిత టూర్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. మీ అంతర్గత శాంతిని కాపాడుకోవడానికి మీరు కొన్ని మతపరమైన ప్రదేశాలను కూడా సందర్శించవచ్చు. మీ గురువులు మీకు సరైన మార్గాన్ని చూపుతారు.

తుల
ఈరాశివారు ఈ రోజు మీరు నీరసంగా ఉంటారు. మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం మంచిది. ఏదైనా పని ప్రారంభించే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మంచిది. సాహస యాత్రకు వెళ్లడం మానుకోవడం మంచిది.

వృశ్చికం
ఈరాశివారికి ఇవాళ మంచి అనుభూతిని చెందుతారు. గృహ సామరస్యం మీకు సంతోషాన్ని కలిగించవచ్చు. వర్క్ ఫ్రంట్‌లో కొన్ని ప్రయోజనాలను పొందడానికి మీరు కొంతమంది ప్రభావవంతమైన వ్యక్తిని కలవవచ్చు. మీరు మీ ఉద్యోగంలో మంచి పనితీరును కనబరచవచ్చు. ప్రమోషన్ల విషయంలో మీరు కొంత రివార్డులను ఆశిస్తారు. వారసత్వంగా వచ్చిన ఆస్తిలో వివాదాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది.

ధనుస్సు
ఈ రోజు మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీ లక్ష్యాల వైపు దృష్టి సారిస్తారు. మీ పనితీరు చాలా బాగుంటుంది. మీ బాస్ మిమ్మల్ని గుర్తిస్తాడు. పనిలో మీకు కొన్ని ముఖ్యమైన బాధ్యతలు ఉంటాయి. మీరు ఏదైనా చట్టపరమైన విషయంలో శుభవార్త వినవచ్చు. మీరు మీ ప్రత్యర్థులు, వ్యాపార ప్రత్యర్థులను నియంత్రించే అవకాశం ఉంది

మకరం
ఈరాశివారికి ఇవాళ ప్రతికూలత ఎక్కువగా ఉంటుంది. బాధ్యతలను భారంగా భావిస్తారు. నచ్చిన పనిని పూర్తి చేయడానికి తొందరపడుతారు. అనవసరపు విషయాల్లో జోక్యం చేసుకోరాదు. పని సామర్ధ్యం దెబ్బతింటుంది. ఇది రోజువారి పనిపై ప్రభావం చూపుతుంది. ప్రాజెక్టులు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సహాకారం తీసుకోవడం మంచిది.

కుంభం
ఈరాశివారికి ఈరోజు కలిసి వస్తుంది. పనిని సజావుగా నిర్వహించడానికి సహాయపడుతుంది. కొన్ని అవకాశాలు పొందుతారు. పనిలో కొంచెం ఓదార్పు లభిస్తుంది. ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా ఉండాలి. ప్రేమికులు సంతోషకరమైన క్షణాలు ఆస్వాదిస్తారు.

మీనం
మీన రాశివారు ఇవాళ చాలా ఉత్సాహంగా ఉంటారు. వాయిదా పడిన ప్రాజెక్టులు వేగవంతం అవుతాయి. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించేందుకు తోటి ఉద్యోగులు సహాయసాకారాలు అందుతాయి. ఉద్యోగులు శుభవార్తలు వింటారు.

.

Dont Miss Reading These Articles

Leave a Reply

Morning Digestion Tips: మంచి జీర్ణక్రియ కోసం ఈ చిట్కాలను పాటించండి Bigg Boss Subhashree Rayaguru: మీకు తన గురించి ఈ విషయాలు తెలుసా? How To Boost Platelet Count: 10 సహజ మార్గాలు Food Tips: ఈ 10 ఆహార పదార్ధలు మీ ఫ్రిజ్ లో నిల్వచేయకండి India vs Pakistan Asia Cup: భారత్-పాకిస్థాన్ ఆసియా కప్ చరిత్ర
%d bloggers like this: