Today Horoscope: 27-మే-2021 రాశిఫలాలు. ఈరాశివారిని భయం వెంటాడుతుంది. అనవసరపు విషయాల్లో తలదూర్చకపోవడం మంచిది.

చాలా మంది తమ భవిష్యత్తు గురించి తెలుసుకునేందుకు ప్రతిరోజు దినఫలాలను చూస్తుంటారు. ఈరోజు అంటే మే 27 గురువారం నాడు చంద్రుడు వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. ఇప్పటికే ఈ రాశిలో అంగారకుడు కూడా ఉన్నాడు. ఫలితంగా కుంభంరాశి వారికి ఫలితాలు అనుకూలంగా ఉంటారు. కొన్ని రాశులవారికి హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది. ఇక మేషం నుంచి మీన రాశి వరకు ఏయో రాశి వారికి ఏలాంటి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
27 మే 2021 దృగ్గణిత పంచాంగం
సూర్యోదయాస్తమయం : ఉ.05.34 / సా.06.35
దిన ప్రమాణం13.01 ని రాత్రి ప్రమాణం 10.59 ని
సూర్యరాశి : వృషభ | చంద్రరాశి : వృశ్చికం/ధనస్సు
శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖమాసం కృష్ణ పక్షం
తిథి : పాడ్యమి మ 01.02 తదుపరి విదియ
వారం : గురువారం (బృహస్పతి వాసరే)
నక్షత్రం : జ్యేష్ఠ రా 10.29 ఆ తదుపరి మూల
యోగం : సిద్ధి సా 06.48 ఆపైన సాధ్య
కరణం : కౌలవ మ 01.02 తైతుల రా 11.16 ఆపైన గరిజ
సాధారణ శుభసమయాలు
ఉ 11.00 – 01.00 సా 04.00 – 05.30
అమృతకాలం : మ 02.42 – 04.07
అభిజిత్ కాలం : ప 11.39 – 12.31
అశుభసమయాలు
వర్జ్యం : ఉ 06.13 – 07.38
దు॥హుర్తం : ఉ 09.55 – 10.47 మ 03.07 – 03.59
రాహు కాలం : మ 01.42 – 03.20
గుళిక కాలం : ఉ 08.49 – 10.27
యమ గండం : ఉ 05.34 – 07.12
ప్రయాణ శూల : దక్షిణ దిక్కు
మేషం
ఈరోజు మీరు నీరసంగా ఉంటారు. కొన్ని భయాలు మిమ్మల్ని వెంటాడుతుంటాయి. ఎవర్నీ నమ్మే పరిస్థితిలో ఉండరు. ఈ పరిస్థితులన్నింటి నుంచి బయటపడేందుకు ధ్యానం చేయడం మంచిది. ప్రార్థన చేయడం జంపించడం వల్ల కొంత మనశ్శాంతి లభిస్తుంది. పెద్దవాళ్ల ఆశీర్వాదంతో ఈ గజిబిజి పరిస్థితుల నుంచి సాయంత్రం వరకు బయట పడతారు.
వృషభం
ఈరోజు మీరు సంతోషంగా గడుపుతారు. పాజిటివ్ మూన్ మీకు సంతోషాన్నిస్తుంది. మీరు సహానం పాటించడం మంచిది. ఉద్యోగంలో రాణిస్తారు. రివార్డుల పరంగా మీకు కొన్ని ప్రోత్సాహకాలు లభిస్తాయి. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు పరిష్కరించబడుతాయి. ప్రేమికులు డేటింగ్నుఎంజాయ్ చేస్తాయి.
మిథునం
ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ చుట్టు ఉన్నవారి నుంచి ఎక్కువ ఆశించకూడదు. అది మిమ్మల్ని నిరాశకు గురిచేస్తుంది. స్వియ అన్వేషణతోపాటు స్వియ విశ్లేషణ కలిగి ఉంటారు. విశ్వాసం కోల్పేయో ప్రమాదం ఉంది. సవాళ్లను ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్ధంగా ఉండాలి.
కర్కాటకం
ఈరోజు మీరున్న చోటును మార్చేందుకు ప్లాన్ చేస్తారు. కొన్ని నిర్ణయాలను వాయిదా వేసుకోవడం మంచిది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. సాయంత్రం వరకు పరిస్థితి మీ అదుపులోకి వస్తుంది. పెద్దల సహాయంతో గజిబిజి పరిస్థితుల నుంచి బయటపడతారు.
సింహం
ఈరోజు మీరు వ్యాపారానికి సంబంధించిన యాత్రలను వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. మీరు సాధించిన విజయానికి బహుమతులు కూడా లభిస్తాయి. మీచుట్టు పక్కల మీకు గౌరవం పెరుగుతుంది. మీ తోబుట్టువుల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. ఉద్యోగం కోరుకునేవారు ఉద్యోగాన్ని సాధిస్తారు.
కన్య
ఈరోజు మీకు కలిసివస్తుంది. బృహస్పతి ఆశీర్వాదం లభిస్తుంది. క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడతారు. పేదవారికి సహాయం చేస్తారు. మీ అభిప్రాయాన్ని కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు కూడా సపోర్టు చేస్తారు. అది వారిలో మీకున్న ప్రతిష్టను పెంచుతుంది. మీ జీవిత భాగస్వామితో కొన్ని అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి.
తుల
ఈరోజు మీ మానసిక స్థితి అంత బాగుండదు. నీరసంగా ఉంటారు. ఆరోగ్యం సరిగ్గా ఉండదు. ఇది మీరోజువారీ దినచర్యను ప్రభావితం చేస్తుంది. డ్రైవింగ్ మరియు అడ్వెంచర్ టూర్లను రష్ లకు దూరంగా ఉండటం మంచిది. పనికిరాని వస్తువులపై కూడా ఖర్చు చేయడం వల్ల పొదుపు పై ప్రభావం చూపుతుంది.
వృశ్చికం
ఈ రోజు పెద్దల ఆశీర్వాదం మీకు సంతోషాన్ని కలిగిస్తుది. మీరు పెట్టిన పెట్టుబడులు మీకు లాభాలను ఇస్తాయి. నష్టాలు ఇప్పుడు లాభాలుగా మారుతాయి. పొదుపులు మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుతాయి. మీరు పిల్లల భవిష్యత్తు కోసం కూడా పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తారు.
ధనుస్సు
ఈ రోజు మీరు బాధ్యతలతోపాటు కొంత నిర్లిప్తత కలిగి ఉంటారు. పనికిరాని వస్తువులను కొనడానికి కూడా ఎక్కువ ఖర్చు చేస్తారు. ఇది ఇల్లు లేదా ఆఫీసులో మీ పట్ల ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. అనవసరపు విషయాల్లో తలదూర్చకపోవడం మంచిది. లేకుంటే ఇబ్బందికరంగా ఉంటుంది.
మకరం
ఈ రోజు మీకు పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. మీరు సహనంగా ఉండటం మంచిది. తల్లిదండ్రుల ఆరోగ్యం ఇప్పుడు మెరగవుతుంది. మీరు మీ సమయాన్ని పెద్దలతో గడపడానికి వెచ్చిస్తారు. మీరు కొంతమంది ప్రభావవంతమైన వ్యక్తులను కలిసే అవకాశం ఉంది. వారు మీకు ప్రొఫెషనల్ పరంగా ముందు ముందు సహాయపడవచ్చు. మీరు శృంగార క్షణాలను కూడా ఆనందిస్తారు.
కుంభం
ఈ రోజు మీరు ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉంటారు. మీ చుట్టూ ఉన్న పేదవారికి సహాయం చేస్తారు. కొంత మొత్తాన్ని దాతృత్వానికి లేదా మతపరమైన స్థలానికి విరాళంగా ఇవ్వడానికి కూడా ప్లాన్ చేస్తారు. మీరు చేసే మంచి పనులు కొన్ని పనులు సాధించడంలో సహాయపడుతాయి. మీ చుట్టూ ఉన్న కొంత దైవిక శక్తి అనూహ్య పరిస్థితులలో మీకు సహాయపడుతుంది. మీరు క్షుద్ర ద్వారా ఆకర్షించబడవచ్చు.
మీనం
ఈ రోజు మీరు సంతోషంగా ఉంటారు. మీరు చుట్టున్నవారిని కూడా సంతోషంగా ఉండేలా చూస్తారు. జీవిత భాగస్వామితో కొన్ని శృంగార క్షణాలు ఆనందిస్తారు. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో మీకు మీ కుటుంబం సపోర్టుగా నిలుస్తుంది. వ్యాపారం లేదా పనిలో మీరు కొన్ని కొత్త వెంచర్లు లేదా భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకుంటారు.