Horoscope : 07-08-2021: నేటి రాశిఫలాలు…ఈ రాశులవారు శుభవార్త వింటారు. ఆదాయం పెరుగుతుంది.

ఈ రోజు శనివారం. ఇవాళ కొన్ని రాశులవారికి అన్నివిధాలా కలిసి వస్తుంది. ఉద్యోగం, వ్యాపారం అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. మరికొందరికీ కొన్ని ఇబ్బందులు తప్పవు. ఆర్థిక సమస్యలూ రావచ్చు. మరి ఏ రాశివారికి ఎలా ఉందో…ఇవాళ్టి రాశి ఫలాల్లో తెలుసుకుందాం.
మేషం
మేషరాశివారు ఈరోజు చాలా శక్తివంతంగా ఉంటారు. లక్ష్యాల వైపు ద్రుష్టి సారిస్తారు. వ్యాపారం వ్రుద్ధి చెందుతుంది. స్థిర ఆస్తులలో పెట్టుబడు పెట్టడానికి మీ అంతర్ ఆత్మను అనుసరించండి. జీవిత భాగస్వామితో భావోద్వేగ సంబంధం మెరుగుపడుతుంది.
వృషభం
ఈరాశివారు కుటుంబం, స్నేహితులతో బిజీగా గడుపుతారు. విహారయాత్రలకు ప్లాన్ చేస్తారు. పిల్లల చదువు విషయంలోనూ బిజీగా ఉంటారు. పిల్లల ఆరోగ్యం మిమ్మల్ని కలవర పెడుతుంది.
మిథునం
ఈ రాశివారు జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి ఒప్పందాలపై సంతకాలు చేయరాదు. ముఖ్యమైన డాక్యుమెంట్లపై సంతకాలు చేసేముందు జాగ్రత్తగా చదవాలి. అతి ఉత్సాహం కారణంగా కొన్ని తప్పులు చేసే ప్రమాదం ఉంది. ఉద్యోగం పరంగా ప్రమోషన్ పొందే ఛాన్స్ ఉంది.
కర్కాటకం
ఈ రాశివారికి చంద్రుని ఆశీస్సులు లభిస్తాయి. ప్రత్యర్థుల నుంచి జాగ్రత్తగా ఉండాలి. వ్రుత్తి పరమైన విషయాల్లో ఫాంటసీ నివారించాలి. కొత్తగా పెట్టుబడులు పెట్టడం నివారించాలి. పెద్దలను జాగ్రత్తగా చూసుకోవాలి.
సింహం
సింహరాశివారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వారసత్వ ఆస్తిని పొందే అవకాశం ఉంటుంది. ఆర్థిక ఆరోగ్యం మెరుగుపడుతుంది నష్టాలు లాభాలుగా మారుతాయి.
కన్య
కన్యరాశివారు ఈరోజుగా బిజీగా గడుపుతారు. పని విషయంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారంలో అభివ్రుద్ధి కనబడుతుంది. జీవిత భాగస్వామితో వివాదాలు పరిష్కారం అవుతాయి.
తుల
తులారాశివారికి ఈరోజు పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. ఆధ్యాత్మికంగా గడుపుతారు. కుటుంబం, స్నేహితులతో కొన్ని మతపరమైన ప్రదేశాలు సందర్శిస్తారు.
వృశ్చికం
ఈ రాశివారు ఈ రోజు చాలా నీరసంగా ఉంటారు. చుట్టూ కొన్ని రహస్యమైన భయాలను ఎదుర్కొంటారు. గందరగోళ పరిస్థితి నుంచి బయటపడేందుకు కొన్ని మతపరమైన ప్రదేశాలను సందర్శించాలి.
ధనుస్సు
ధనుస్సు రాశివారు కుటుంబం, స్నేహితులతో బిజీగా గడుపుతారు. దంపతుల మధ్య గౌరవం పెరుగుతుంది. భాగస్వాములతో అనేక వివాదాలు పరిష్కారం అవుతాయి. విద్యార్థులు తమ కెరీర్ పరంగా తొందరగా నిర్ణయాలు తీసుకుంటారు.
మకరం
మకరం రాశివారికి అన్నివిధాల కలిసి వస్తుంది. ప్రత్యర్థులు ఇప్పుడు మీ నియంత్రణలో ఉంటారు. ఇరుక్కుపోయిన డబ్బును తిరిగి పొందుతారు.
కుంభం
ఈరోజు కుంభరాశివారు పిల్లలకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉంటారు. పిల్లల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉన్నత చదువుల కోసం ప్లాన్ చేస్తారు.
మీనం
మీన రాశివారికి ఇవాళ ఆశజనంకంగా ఉండదు. ప్రతికూల పరిస్థితులు మిమ్మల్ని కలవరపెడుతుంది. చుట్టున్న సానుకూల వ్యక్తులతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలి. విద్యార్థులు సహనంతో ఉండాలి.