Rashi Phalalu (3rd Apr 2023): ఈరోజు రాశి ఫలాలు

Rashi Phalalu (3rd Apr 2023): ఈరోజు రాశి ఫలాలు
Image Source: Instagram

మేష రాశి : అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి ఈ రోజు వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. మేషరాశికి జన్మరాశియందు శుక్ర, రాహువులు మరియు వ్యయస్థానమునందు రవి, బుధ, గురులు సంచారంచేత పనులు యందు ఆలస్యము మానసిక ఒత్తిళ్ళు మరియు శారీరక శ్రమ అధికముగా ఉండును.  ముఖ్యమైన పనులలో తొందరపాటు నిర్ణయాలు పనిచేయవు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలలో నూతన సమస్యలు కలుగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభ రాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి ఈ రోజు చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. దీర్ఘకాలిక రుణాలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఒడిదుడుకులు అధికమౌతాయి. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహపరుస్తుంది. సన్నిహితుల నుండి కీలక సమాచారం సేకరిస్తారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. వృషభరాశివారికి లాభమునందు గురుడు, దశమము నందు శని ప్రభావం చేత ఆర్ధికపరంగా లాభము చేకూరును. ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం వృషభరాశివారు లింగాష్టకాన్ని పఠించడం మంచిది.

మిథున రాశి : మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి, ఈ రోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సోదరులతో సఖ్యత కలుగుతుంది. ముఖ్యమైన వ్యవహారంలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటక రాశి :పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి ఈ రోజు చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం ఉండదు. ప్రయాణమున మార్గావరోధాలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. నూతన రుణాలు చేయవలసి వస్తుంది. వృత్తి ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది

సింహరాశి : మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి ఈ రోజు బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్థిరాస్తి వృద్ధి కలుగుతుంది. ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్య రాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి, ఈ రోజు కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. చేపట్టిన పనులు సమయానికి పూర్తి కావు. దూర ప్రాంత బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగులకు ఆశించిన ఫలితాలు ఉండవు. ఆదాయం మార్గాలు గంధరగోళంగా ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులా రాశి : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి, ఈ రోజు జీవిత భాగస్వామితో దూరప్రాంత ప్రయాణాలు చేస్తారు. గృహమున సంతోషకర వాతావరణం ఉంటుంది. గృహమున కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. మొండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చిక రాశి :

విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి ఈ రోజు ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాల గురించి చర్చిస్తారు. దీర్ఘకాలిక వివాదాలను పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ధనుస్సు రాశి :

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి ఈ రోజు సన్నిహితుల నుండి ఋణ ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపార సంబంధిత వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగ, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకర రాశి :

ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి ఈ రోజు ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. చేపట్టిన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు చికాకు కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగాలలో నూతన సమస్యలు కలుగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభ రాశి :

ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి ఈ రోజు ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. నూతన వాహన యోగం ఉన్నది. సంతాన విద్యా విషయాలు సంతృప్తి కలిగిస్తాయి. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగమున ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మీన రాశి :

పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి ఈ రోజు శత్రువులకు సైతం సహాయ సహకారాలు అందిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు లభిస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగములో సమస్యలు తొలగి అధికారుల ఆదరణ పెరుగుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 3 Comments

Dont Miss Reading These Articles

Leave a Reply

Morning Digestion Tips: మంచి జీర్ణక్రియ కోసం ఈ చిట్కాలను పాటించండి Bigg Boss Subhashree Rayaguru: మీకు తన గురించి ఈ విషయాలు తెలుసా? How To Boost Platelet Count: 10 సహజ మార్గాలు Food Tips: ఈ 10 ఆహార పదార్ధలు మీ ఫ్రిజ్ లో నిల్వచేయకండి India vs Pakistan Asia Cup: భారత్-పాకిస్థాన్ ఆసియా కప్ చరిత్ర
%d