Foods that keep lungs healthy: టెన్షన్ లేకుండా ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినండి..

శరీరం సరిగ్గా పనిచేయాలంటే ఉపిరితిత్తులు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. పెరుగుతున్న వాయుకాలుష్యం, ధూమపానం, ఉబ్బసం,సిస్టిక్ పైబ్రోసిస్, క్రానిక్ అబ్ర్సక్టివ్ పల్మనరీ డిసిజ్ వంటి శ్వాసకోశవ్యాధులు బాగా పెరిగిపోతున్నాయి. డబ్ల్యూహెచ్ఓ నివేదిక ప్రకారం కాలుష్యానికి గురికావడం వల్ల ప్రతిఏడాది ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4.2మిలియన్ల మంది మరణిస్తున్నారని తెలిపింది.
వాయికాలుష్యానికి ఎక్కువగా గురికావడం వల్ల శ్లేష్మం వ్యాధికారక, సూక్షజీవులను సంగ్రహించడానికి ఊపిరితిత్తులలో సేకరిస్తుంది. ఛాతీ నిండి ఆయసంగా మారుతుంది. వీటన్నింటి నుంచి ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచాలంటే..మీ ఆహారంలో కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను జోడించడం వల్ల…హానికరమైన కాలుష్యం నుంచి ఊపిరితిత్తులను రక్షిస్తాయి. శ్వాసతీసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
యాపిల్స్
యాపిల్స్ లో ఫినోలిక్ సమ్మేళనాలు, ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇవి శ్వాసనాలలో మంటను తగ్గించడానికి సహాయపడుతాయి. రోజుకు ఒక గ్లాస్ యాపిల్ జ్యూస్ తీసుకున్నట్లయితే….చిన్నారుల్లో వచ్చే శ్వాసకోశలోపం నుంచి బయటపడవచ్ఛు.
గ్రీన్ టీ
గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇవి ఊపిరితిత్తులలో మంటను తగ్గిస్తాయి. యాంటీఆక్సిడెంట్ క్వెర్సెటిన్ సహజయాంటిహిస్టామైన్ వలె పనిచేస్తుంది. అలెర్జీ లక్షణాలకు కారణమయ్యే హిస్టామిన్ ను విడుదలను తగ్గిస్తుంది. కొరియాలో గ్రీన్ టీ తాగేవారు…తాగనివారిపై ఓ సర్వే నిర్వహించారు. రోజు రెండు కప్పుల గ్రీన్ టీ తాగిన వెయ్యిమంది పెద్దవారిలో ఊపిరితిత్తుల పనితీరు బాగుందని తెలిపింది
చేపలుమాకేరెల్,ట్రౌట్, సార్డినెస్, హెర్రింగ్ వంటి చేపలు దీర్ఘకాలిక అబ్ర్సక్టివ్ పల్మనరీ డిసిజ్ చికిత్సకు సహాయపడుతాయి. రోచెస్టర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అండ్ డెంటిస్ట్రీ విశ్వవిద్యాల పరిశోధకుల అభిప్రాయం ప్రకారం….చేపలలో కనిపించే ఒమేగా 3 కొవ్వు అమ్లాలు శరీరానికి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లను ఎదుర్కొవటానికి సహాయపడుతాయి
గింజలు, విత్తనాలు
గింజలు, విత్తనాలు ఊపిరితిత్తులకు మరో సూపర్ ఫుడ్. బాదం, జీడిపప్పు, వాల్ నట్స్, పిస్తా, బ్రెజిల్ గింజలు, హాజెల్ నట్స్ , గుమ్మడికాయ గింజలు,అవిసె గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు వంటి గింజలు…మీ శరీరానికి మెగ్నీషియంను పుష్కలంగా అందిస్తాయి. ఇది బ్రోంకోడైలేటర్ గా పనిచేస్తుంద
ఆలివ్ ఆయిల్
ఆలివ్ నూనెలో మోనోశాచురేటెడ్ కొవ్వులు, విటమిన్ ఇ, విటమిన్ కె పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఊపిరితిత్తులలోని ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించడానికి, ఊపిరితిత్తల కణజాల నష్టాన్ని నివారించడంలో సహాయపడతాయి
బ్రోకలీబ్రోకలీలో సల్ఫోరాఫేన్ ఉంటాయి. ఇది ఊపిరితిత్తుల కణాలలో కనిపించే జన్యువు చర్యను పెంచుతుంది. ఇది ఆక్సీకరణ ఒత్తిడి వల్ల కలిగే నష్టం నుంచి అవయవాన్ని రక్షిస్తుంది. ఇది ఆస్ల్మా టిక్స్లో ఊపిరితిత్తులలో శ్వాసనాలాన్ని మెరుగుపరుస్తుంది.
అల్లం
అల్లం శరీరంలో మంటను తగ్గించే గుణం ఉంటుంది. ఇది ఊపిరితిత్తుల నుంచి కాలుష్య కారకాలను తొలగించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇది గ్యాస్ట్రీక్ సమస్యను తగ్గిస్తుంది. గాలి మార్గాను అన్ లాక్ చేస్తుంది. ఊపిరితిత్తులకు ప్రసరణను మెరుగుపరుస్తుంది. తద్వారా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని పెంచుతుంది
వెల్లుల్లివెల్లుల్లిలో ఫ్లెవనాయిడ్స్ ఉన్నాయి. ఇవి గ్లూటాతియోన్ ఉత్పత్తిని ఉత్తేజపరుస్తాయి. క్యాన్సర్ కారకాలను తొలగించడంతోపాటు.. ఊపిరితిత్తుల పనితీరుకు సహాయపడతాయి. మూడు లవంగాలు, పచ్చి వెల్లుల్లిని వారానికి రెండుసార్లు తినేవారికి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం 44శాతం ఉందని ఒక అధ్యయనంలో తేలింది.
తృణధాన్యాలుబ్రౌన్ రైస్,క్వినోవా,గోధుమ వంటి ధాన్యపు ఆహారాలను మీరు రోజువారి ఆహారంలో చేర్చండి. ఇవి దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తాయి. శ్వాసకోశ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి.
కారపు మిరియాలు
కారపు మిరియాలు క్యాప్సైసిస్ కలిగి ఉంటాయి. ఇదిస్రావాలను ఉత్తేజపరచడంలో సహాయపడుతాయి. శ్వాసకోశంలోని శ్లేష్మపొరలను రక్షిస్తుంది. కాబట్టి మీ ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో మిరియాలను తీసుకోవడం చాలా మంచిది. కారపు మిరియాల టీ తాగినట్లయితే…ఉబ్బసం లక్షణాలను వదిలించుకోవచ్చు.