Drink Tea to Get Pregnant: గర్భధారణలో ఇబ్బందులు పడుతున్నారా? గర్భం దాల్చలంటే ముందు రోజూ ఈ టీ తాగండి.

టీలో కేఫిన్ ఉంటుందని అందరికీ తెలుసు. మీరు టీని ఎక్కువ మొత్తంలో తీసుకున్నట్లయితే…దాని పరిమాణాన్ని తగ్గించాలి. టీకి ప్రత్యామ్నాయ పానీయాలను తీసుకోవాలి. బరువు తగ్గడం నుంచి అనే వ్యాధులబారి నుంచి కాపాడాటం వరకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న టీలు చాలా ఉన్నాయి. శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు హెర్బల్ టీలో పుష్కలంగా లభిస్తాయి. ఈ రకమైన టీలు సంతోనోత్పత్తిని పెండటంతోపాటు తొందరగా గర్భం ధరించడానికి సహాయపడుతాయి.
ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్న చాలా మంది జంటలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య వంధ్యత్వం. ఒత్తిడి, అనారోగ్యకరమైన జీవనశైలి దీని కారణం. కానీ సంతానోత్పత్తికి ట్రీట్మెంట్ కోసం హాస్పటల్ కు వెళ్లే ముందు కొన్ని సహజమార్గాలను కూడా ప్రయత్నించండి.
సీమచామంతి టీ చమోమిలే టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది పునరుత్పత్తికి ఎంతగానో తోడ్పడుతాయి. కాబట్టి ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్న జంటలు రోజూ ఈ చమోమిలే టీ ఉదయాన్నే తీసుకున్నట్లయితే…మంచి ఫలితం ఉంటుంది.
పుదీనాటీ పుదీనా టీ రిఫ్రెష్ చేయడానికి మాత్రమే కాదు…పలు ఆరోగ్య ప్రయోజనాలు కడా ఇందులో ఉన్నాయి. గర్భం ధరించడానికి యత్నిస్తున్న జంటలు పుదీనా టీ సేవించినట్లయితే…పిండం ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. అంతేకాదు త్వరగా గర్భందాల్చేందుకు సహాయపడుతుంది.
గ్రీన్ టీ గ్రీన్ టీలో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రజయోజనాలున్నాయి. బరువు తగ్గాలనుకునేవారు గ్రీన్ టీ తాగుతుంటారు. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలను కలిగి ఉంటుంది. కాబట్టి సంతానం కోసం ప్రయత్నిస్తున్న జంటలు ఈ గ్రీన్ టీ తీసుకోవడం మంచిది.
రాస్ప్బెర్రీ లీఫ్ టీ ఇందులో శక్తివంతమైన ఫైటో ప్రొజెస్టెరాన్ లక్షణాలు ఉన్నాయి. ఇవి శరీరంలో ప్రొజెస్టెరాన్ స్థాయిని పెంచేందుకు సహాయపడుతుంది. ప్రొజెస్టిరాను సంతానోత్పత్తిని పెంచే ముఖ్యమైన హార్మోన్ అని అందరికీ తెలుసు.
రెడ్ క్లోవర్ టీ ఇది ప్రాచీనకాలం నుంచి సంతానోత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఇది ఐసోప్లేవోన్స్ లేదా ఫైటోఈస్ట్రోజెన్స్ అని పిలిచే సహాజ మొక్క ఇది ఫైటోఈస్ట్రోజెన్స్ అని పిలిచే సహాజ మొక్క ఇది.
మీరు తొందరగా గర్భంధరించడానికి సహాయపడటానికి మీరు రోజూ తీసుకునే ఆహారంలో ఈ టీలను చేర్చుకోండి. ఈ టీలు మీకెన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అంతేకాదు కేలరీలను తగ్గిస్తాయి.