FLU-CORONA DIFFERENCES: ఏది కరోనా? ఏది సీజనల్? రోగమేదో తెలియక జనం అవస్థలు!

*జ్వరం, దగ్గు వస్తే వెన్నులో వణుకు
*తలనొప్పి, ఒళ్లు నొప్పులు వచ్చినా భయం
*లక్షణాల ఆధారంగా తెలుసుకోవచ్చు అంటున్న డాక్టర్లు
దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తున్న తరుణంలో ఏ చిన్న ఇబ్బంది కలిగినా.. కరోనా వచ్చిందేమోననే అనుమానం కలుగుతోంది. ఇంతకు ముందు ఎంత పెద్ద జ్వరం వచ్చిన భయపడని వారు… ప్రస్తుతం బాడీ కొంచెం హీటెక్కినా అమ్మో కరోనా వచ్చిందేమో అని అమనుమానపడుతున్నారు. జలుబు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు ఏది వచ్చినా కరోనా వైపే మనసు మళ్లుతోంది.
ఏది కరోనా.. ఏది సీజనల్ వ్యాధి అన్నది తెలియక జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దగ్గు వచ్చినా గుండెల్లో కరోనా దడ పుడుతున్నది. జ్వరం అనిపిస్తే ముచ్చెమటలు పడుతున్నాయి. సీజనల్ వ్యాధుల లక్షణాలు, కరోనా లక్షణాలు దాదాపుగా ఒకేలా ఉండడంతో జనం భయపడతున్నారు. అయితే కొన్ని లక్షణాలతో కరోనానా? సీజనలా? అన్నది తెలుసుకోవచ్చని డాక్టర్లు చెప్తున్నరు. అయితే ఏది కరోనా? ఏది సీజనల్? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
కరోనా లక్షణాలుః
*తీవ్ర జ్వరం
*మూడు రోజులైనా తగ్గదు
*జలుబు ఉన్నా ముక్కు కారదు
*పొడి దగ్గు వస్తుంది
*రుచి, వాసన తెలియదు
*ఒంటినొప్పులు తీవ్రంగా ఉంటాయి
*తలనొప్పి తీవ్రంగా ఉంటుంది
*గొంతునొప్పి ఉంటుంది
*ఛాతిలో నొప్పి వస్తుంది
*కండ్లు ఎర్రబడతాయి
*వాంతులు, విరేచనాలు ఉంటాయి
సీజనల్ లక్షణాలుః
*సాధారణ జ్వరం
*మూడు రోజుల్లో తగ్గుతుంది
*ముక్కు కారుతుంది
*కఫంతో కూడిన దగ్గు వస్తుంది
*రుచి, వాసన తెలుస్తుంది
*ఒంటినొప్పులు సాధారణంగా ఉంటాయి
*తలనొప్పి సాధారణంగా ఉంటుంది
*గొంతునొప్పి ఉంటుంది
*ఛాతి నొప్పి ఉండదు
*కండ్లు ఎర్రబడవు
*వాంతులు, విరేచనాలు ఉంటాయి