ప్రసవం తర్వాత సెక్స్…..అప్పటివరకు ఆగాల్సిందేనా…?
డెలివరీ తర్వాత స్త్రీ శరీరం సెక్స్ కు అనువుగా ఉంటుందా? ప్రసవించిన తర్వాత ఎన్ని నెలల తర్వాత సెక్స్ లో పాల్గొనాలి? తొమ్మిది నెలలు బిడ్డను మోసిన స్త్రీ శరీరం సెక్స్ కు సపోర్టు చేస్తుందా? వీటన్నింటికి కాదనే సమాధానం చెప్పాలి. ఎందుకంటే డెలివరీ తర్వాత కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఈ సమయంలో స్త్రీ శరీరం సెక్స్ కు అనువుగా ఉండదు. ఎందుకంటే బిడ్డ యోగక్షేమాలు చూసుకోవడం…ఈ మధ్య కాలంలో చాలామందికి నార్మల్ డెలివరీల కంటే సిజేరియన్లు చాలా జరుగుతున్నాయి. నార్మల్ గా మారాడానికి దాదాపు మూడు నెలల సమయం పడుతుంది. కాబట్టి డెలివరీ తర్వాత స్త్రీలు సెక్స్ ఎక్కువగా ఇష్టపడరు.
సెక్స్…..భార్యభర్తల అనుబంధానికి ప్రతీక. వివాహబంధం బలంగా ఉండానికి ముఖ్యకారణం. అయితే కొన్ని సందర్భాల్లో కాస్త విరామం వస్తుంటుంది. భార్య ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కొంతకాలం సెక్స్ కు దూరంగా ఉండాల్సి వస్తుంది. భార్యను అర్ధం చేసుకునే భర్తలుంటే….డెలివరీ అయిన కొన్ని నెలల వరకు వేచి ఉంటారు. కానీ కొంతమంది మగాలు…పక్కదారులు పట్టే సందర్భాలూ చాలా ఉంటాయి.
ఇక గర్భం దాల్చిన స్త్రీ ఆరోగ్య పరంగా బాగుంటే మాత్రం ఎనిమిదవ నెల వరకు శారీరక సంబంధాలు కొనసాగించవచ్చని వెద్యులు చెబుతుంటారు. అయితే డెలివరీ తర్వాత ఎప్పుడు సెక్స్ లో పాల్గొంటే మంచిదనే సందేహం చాలా మందిలో కలుగుతుంది. కొంతమంది భార్య ప్రసవించిన నెలకాకముందే సెక్స్ లో పాల్గొనమని తొందరపెడుతుంటారు. మానసికంగా హింసిస్తుంటారు. అలాంటి సమయాల్లో స్త్రీలకు ఇష్టం లేకపోయినా…శరీరం సహకరించకపోయినా…భర్త ప్రొద్భలంతో సెక్స్ పాల్గొనాల్సి వస్తుంటుంది.
ప్రసవించిన తర్వాత 4 నుంచి 6నెలల వరకు సెక్స్ చేయకూడదని చెబుతుంటారు. అయితే ఈ వాదనను కొట్టిపారేస్తున్నారు సైకాలజిస్టులు. ప్రసవించిన తర్వాత స్త్రీ ఆరోగ్యం బాగుంటే ఆరు వారాల తర్వాత సెక్స్ ను ఎంజాయ్ చేయవచ్చిన చెబుతున్నారు. సిజేరియన్ అయిన స్త్రీలు కొంతకాలం వేచిఉండటం మంచిదంటున్నారు. ఎందుకంటే ఆపరేషన్ తర్వాత కుట్లు గాయాల నుంచి కోలుకోవడానికి సమయం పడుతుంది. కాబట్టి పురుషులు కొంతకాలం ఆమెను ఇబ్బంది పెట్టకపోవడమే మంచిదంటున్నారు.
నార్మల్ డెలివరీ అయిన మహిళలు 6వారాల తర్వాత సెక్స్ లైఫ్ ఎంజాయ్ చేయవచ్చని చెబుతున్నారు. ఈ సమయంలో గర్భనిరోధకాలు మాత్రలు వాడటం మంచిదని సూచిస్తున్నారు. ఎందుకంటే ప్రసవించిన తర్వాత దాదాపు రెండు నుంచి మూడు సంవత్సరాలు తర్వాత తిరిగి గర్భం దాల్చినట్లయితే స్త్రీకి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు. త్వరగా గర్భం దాల్చినట్లయితే అనారోగ్య సమస్యలు చాలా ఎదుర్కవల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.