Papaya Pack for Glowing Skin: మీ ముఖం మెరవాలంటే…బొప్పాయి ఐస్ ప్యాక్ ట్రై చేయండి!

నిద్ర లేచిన మొదలు ఎంతో మందిని చూస్తుంటాం…మరెంతో మందిని కలుస్తుంటాం. ఎదుటివారిని ఆకర్షించాలంటే ముందు మన ముఖం చిరునవ్వుతో ఉండాలి. కానీ కొందరు నవ్వడానికి కూడా మొహమాటపడుతుంటారు. అందుకు కారణం ముఖం జిడ్డుగా ఉండటం, డ్రైగా ఉండటం, మచ్చలు, మొటిమలు ఇలా ఎన్నో రకాల సమస్యలు వారిని సతమతం చేస్తుంటాయి. అయితే అలాంటి వారికి పపాయ ఫేస్ ఫ్యాక్ ముఖంలో గ్లో తీసుకువస్తుంది. ఇంట్లో కూర్చుని ఐదు నిమిషాల్లో పపాయ ఐస్ ఫేషియల్ ను రెడీ చేసుకోవచ్చు. బ్యూటీ పార్లర్ల వెంట తిరిగి డబ్బుల ఖర్చు చేసుకునే బదులుగా…ఒక అరగంట ఈ ఫేస్ ప్యాక్ కు కేటాయించండి. మీ ముఖంలో వచ్చిన గ్లో చూసి ప్రతిఒక్కరూ ఈ రహస్యాన్ని అడుగుతుంటారు. పపాయ ఐస్ ఫేస్ ప్యాక్ గురించి తెలుసుకుందాం.
పప్పాయ, ఐస్ క్యూబ్స్ తో కొద్ది నిమిషాల్లోనే మీ ముఖాన్ని ప్రకాశవంతంగా చేస్తాయి. చర్మం బిగుతుగా మారుతుంది. అలాగే, వేసవికాలంలో చర్మానికి చల్లదనాన్ని ఇవ్వడంతోపాటు చర్మంపై ఉండే ట్యాన్ ను తొలగిస్తుంది. పప్పాయ, ఐస్ క్యూబ్స్ చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇంట్లోనే ఈ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలో చూద్దాం
బొప్పాయి, ఐస్ క్యూబ్స్ తో తయారు చేసిన ఫేస్ ప్యాక్ 4 నుంచి 5రోజుల పాటు ఉపయోగించవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ క్రమం తప్పకుండా వాడినట్లయితే వయస్సు ప్రభావం మీ ముఖంపై కనిపించదు. అన్ని చర్మరకాలకు ఉపయోగించవచ్చు. అయితే మీ చర్మాన్ని బట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
తయారీ విధానం
-ఒక బొప్పాయి ముక్క
-3 టీస్పూన్ల రోజ్ వాటర్
-2 టీస్పూన్ల తేనె
-2 చిటికెడు పసుపు
మొదట బొప్పాయిని పేస్ట్ లా తయారు చేసుకోండి. ఇప్పుడు అందులో రోజ్ వాటర్, తేనె మరియు పసుపు కలపాలి. తయారుచేసిన పేస్ట్‌ను ఐస్ ట్రేలో నింపి ఫ్రిజ్‌లో ఉంచండి.
చర్మంపై ఎలా అప్లై చేయాలి
బొప్పాయి ఐస్ క్యూబ్స్ రెడీ అయ్యాక…కోల్డ్ ఫేషియల్స్ చేసేటప్పుడు…ముఖం బాగా కడగాలి. ముఖం కడిగేటప్పుడు నాణ్యమైన ఫేస్ వాష్ వాడటం మంచిది. ఇప్పుడు ఐస్ క్యూబ్స్ ను కాటన్ క్లాత్ లో చుట్టి….ముఖంపై రుద్దండి. మొత్తం ముఖం మీద, కళ్ల కింద చర్మంపై కూడా నెమ్మదిగా రుద్దాలి. ఈ ఐస్ క్యూబ్స్ ఉదయం లేదా సాయంత్రం సమయంలో వాడటం మంచిది. ఉదయం, సాయంత్రం ఒక ఐస్ క్యూబ్ మాత్రమే వాడంటి. మధ్యాహ్నం అయితే రెండు లేదా అంతకంటే ఎక్కువగా ఉపయోగించవచ్చు
ఆయిల్ స్కిన్
జిడ్డు చర్మం ఉన్నవారు ఐస్ క్యూబ్ తో మసాజ్ చేసిన తర్వాత టోనర్ వాడండి. టోనర్ వాడినట్లయితే తేమను కంట్రోల్ చేయడంతోపాటు…చర్మాన్ని బిగుతుగా ఉంచుతుంది.
డ్రై స్కిన్
మీది చర్మం పొడి చర్మం అయితే ఐస్ క్యూబ్ అప్లై చేసిన తర్వాత, మొదట ముఖం మీద టోనర్ వేసి, ఆపై మాయిశ్చరైజర్ తో మసాజ్ చేయండి. మసాజ్ చేసేటప్పుడు చర్మంపై ఎక్కువ ఒత్తిడి చేయవద్దు, కానీ నెమ్మదిగా చేతులతో వృత్తాకార కదలికలో మసాజ్ చేయండి.
సాధారణ చర్మం
సాధారణ చర్మ స్వభావం కలిగి ఉంటే, బొప్పాయి ఐస్ ఫేషియల్స్ తరువాత, మీ ముఖం మీద టోనర్ వాడండి మరియు తరువాత కలబంద జెల్ ను కూడా అప్లై చేయండి. వేసవి కాలంలో ఒక వారం పాటు మీరు ఈ విధంగా చేసినట్లయితే…అందమైన ప్రకాశవంతమైన చర్మం మీ సొంతం అవుతుంది.