Neem Amazing Benefits: వేపాకులతో మొటిమలు, మచ్చలు లేని… కాంతివంతమైన చర్మం మీ సొంతం!

pic credit:stylecraze
ఆరోగ్యవంతమైన చర్మాన్ని కలిగి ఉండటం….మీ రోజువారీ అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. మీ చర్మాన్ని ఎలా కాపాడుకోవాలి అనే దానిపై చాలా అభిప్రాయాలు ఏర్పడుతాయి. చివరిగా మీ చర్మాన్ని కాపాడుకునే బాధ్యత మాత్రం మీ వ్యక్తిగతమైంది. మీ చర్మ సంరక్షణకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే మంచి ఆహారం తీసుకోవడం, కెమికల్స్ లేని ఆయుర్వేద ఫేస్ ప్యాక్ లను ఉపయోగించడం.
ఈ మధ్యకాలంలో యువత…అందంగా కనిపించేందుకు మార్కెట్లో దొరికే ఉత్పత్తులను ఎక్కువగా వాడుతున్నారు. వాటిలో ఉండే రసాయనాలు చర్మానికి ఎంతో హానికలిగిస్తున్నాయి. దీంతో చర్మం పట్టుకోల్పోయి…అందవికారం కనిపిస్తుంది. మోతాదుకు మించిన రసాయానాలు వాడటం ఏమాత్రం మంచిది కాదు. అవన్నీ పక్కనపెడితే…ఇంట్లోనే చర్మ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. అందమైన చర్మాన్ని సొంతం చేసుకునేందుకు గుప్పెడు వేపాకులు ఉంటే చాలు.
వేపాకుల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అది నల్లమచ్చలను, మొటిమలను, పొడిబారే చర్మం, ముడతలను తొలగిస్తుంది. కొత్త కణాలు ఏర్పాడేలా చేస్తుంది. వేపతో తయారయ్యే సబ్బులతో స్నానం చేసేవారి చర్మం కోమలంగా, మ్రుదువుగా ఉంటుంది. చర్మంపై ఎలాంటి సమస్యలున్నా సరే వేపాకులు పోగొట్టుతాయి. కొన్ని వేపాకుల్ని కడిగి…మెత్తని పేస్టులా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని చర్మంపై పూసుకోవాలి. 15 నుంచి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇందులో కొంచెం పెరుగు లేదా నిమ్మరసం కలుపుకుంటే ఇంకా మంచి ఫలితం ఉంటుంది.
కొత్తమందికి ఆయిల్ స్కిన్ ఉంటుంది. వారికి వేపాకులు మంచి ఔషదంగా పనిచేస్తాయి. వేపాకులు ఎక్కువగా ఆయిల్ ఉత్పత్తి కాకుండా చేసే గుణం వాటిలో ఉంది. అంతేకాదు డ్రైన్ స్కిన్ వారికి మంచి మాయిశ్చరైజర్ లా పనిచేస్తాయి. పొడిబారిన చర్మం ఉన్నవాళ్లు…వేపాకు పేస్టులో కొద్దిగా తేనె కలిపి రాసుకోవాలి. పావు గంట తర్వాత గోరువెచ్చని నీటితో కడుగుతే…చర్మంగా కోమలంగా మ్రుదువుగా ఉంటుంది.
ఆయిల్ స్కిన్
కొంతమందికి ఆయిల్ స్కిన్ ఉంటుంది. వేపాకులు… ఆయిల్ ఎక్కువ ఉత్పత్తి కాకుండా చెయ్యగలవు. అలాగే డ్రై స్కిన్‍కి మాయిశ్చరైజర్‌లా కూడా పనిచేస్తాయి. పొడిబారిన చర్మం ఉండేవారు… వేప పేస్టులో.. కొద్దిగా తేనే కలిపి ముఖానికి రాసుకోవాలి. పావు గంట తర్వాత కడిగేసుకుంటే… చర్మం కోమలంగా ఉంటుంది.
డెడ్ స్కిన్
డెడ్ స్కిన్ ను తొలగించే శక్తి వేపాకులకు ఉంటుంది. వేపాకుల పేస్టును శరీరానికి రాసుకుని స్నానం చేస్తే….చర్మం మెరుస్తుంది. అందులో కొంచెం రోజ్ వాటర్, గంధపు పొడి, ఆలివ్ ఆయిల్, కమలాపండు తొక్కల పొడి కలిపి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు చర్మవ్యాధులు సైతం ధరిచేరవు.
వేపపాకు, పసుపు ప్యాక్
వేప, పసుపు కలిపి ప్యాక్ వేసుకున్నట్లయితే….చర్మం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. వేపలో యాంటీ బ్యాక్లీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. పొడి, జిడ్డు చర్మానికి వేప పేస్టు అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ పొడిబారిన చర్మం, మొటిమలను తొలగించడమే కాకుండా చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది.
వేపా, తులసి ప్యాక్
తులసీని ఔషధ మొక్కల రాణి అని పిలుస్తుంటారు. ప్రతి ఇంటిలో తులసి మొక్క ఉంటుంది. వేప,తులసి కలిపి ఫేస్ ప్యాక్ వేసుకున్నట్లయితే…చర్మానికి చాలా ప్రయోజనకారంగా ఉంటుంది. ఈ ప్యాక్ వల్ల ముఖంపై ఏర్పడిన మచ్చలు, వాటి తాలుకు నల్లమచ్చలు, మొటిమలను తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఆరోగ్యకరమైన చర్మాన్ని కూడా ఇస్తుంది.
వేప, బొప్పాయి ప్యాక్
pic credit boldsky hindi
మీ చర్మానికి పూర్వవైభవం తీసుకురావాలంటే వేప, బొప్పాయి ప్యాక్ ఎంతో ప్రయోజనకారంగా ఉంటుంది. వేప, బొప్పాయి రెండు కలిపి పేస్టులా తయారు చేసి ముఖంపై ప్యాక్ వేసుకోవాలి. పొడిబారిన మీ ముఖాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది.