అమ్మకు కుంకుమపువ్వు…ప్రసవం తర్వాత తినడం మంచిదేనా?
ప్రసవం….స్త్రీకి ఓ అద్భుతమైన అనుభూతి. అంత తేలికైన ప్రక్రియ అస్సలు కాదు. ప్రసవించే ముందు స్త్రీలు ఎదుర్కొనే సమస్యలు, సవాళ్ళు చాలా ఉంటాయి. ప్రసవించిన తర్వాత….చాలా మంది తల్లులు చిరాకు, కోపం, ఒత్తిడి కి గురువుతుంటారు. చాలా మంది స్త్రీలు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటారు. దాదాపు 15శాతం మంది స్త్రీలను ఈ లక్షణాలు ప్రభావితం చేస్తుంటాయి. ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయి. ప్రసవించిన తర్వాత మహిళలలో హార్మోన్స్ ఇంబ్యాలేన్స్ అవుతుంటాయి. మానసికంగా చాలా బాధలు ఎదుర్కోవల్సి వస్తుంది. ఆకలి ఉండకపోవడం, ఎక్కువగా ఆకలి, నిద్రరాకపోవడం వంటి మార్పులు కనిపిస్తాయి. ఇలాంటి సమస్యల వల్ల స్త్రీలు ఒత్తిడికి లోనవుతుంటారు. అంతేకాదు ప్రసవించిన తర్వాత వచ్చిన మార్పుల వల్ల తల్లీబిడ్డలపై కూడా ప్రభావం ఉండవచ్చు.
ఈ మధ్య కాలంలో ప్రసవించిన తర్వాత ఒత్తిడికి సిరోటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్లతో ట్రీట్మెంట్ చేస్తున్నారు. దీన్నే CSIRఅని పిలుస్తారు. ఇది యాంటిడిప్రెసంట్ మెడిసన్ల కలయిక. అయితే దీన్ని తీసుకోవడం ద్వారా రానున్న కాలంలో చాలా వరకు సమస్యలు ఎదర్కోవల్సి వస్తుంది. కాబట్టి డెలివరీ తర్వాత SSRIలు హెల్తీమెడిసన్లు కావు. మరి వీటన్నింటికి ప్రత్యామ్నాయం ఏంటి? వీటన్నింటికి పరిష్కారం కుంకుమపువ్వు. దీనిని మీరు తీసుకునే ఆహారంలో చేర్చకోవడం.
కుంకుమపువ్వు గర్భవతిగా ఉన్న సమయంలో తీసుకోవాలి కదా అనే డౌట్ మీకు వచ్చిది కదా? కొత్తగా అమ్మతనాన్ని అనుభవించాలంటే ఒత్తిడి, చిరాకు, కోపం వంటి సమస్యలను దూరంగా ఉండాలి. వీటి నుంచి కుంకుమపువ్వు కాపాడుతుంది. కొంతమంది అధ్యాయనకారులు చెబుతున్న విషయం ఇది. డెలివరీ తర్వాత బాధపడుతున్న కొంత మంది స్త్రీలను రెండు సముహాలుగా విభిజించి….వారికి SSRIల ప్రణాళిక ప్రకారం ఇచ్చారు. ఇంకో గ్రూపునకు నెలన్నర తర్వాత రోజుకు రెండుసార్లు 15mg కుంకుమ పువ్వు ఇచ్చారు.
దాదాపుగా మూడు వారాల తర్వాత రిజల్ట్ చూస్తే….SSRI తీసుకున్న వారిలో స్ట్రెస్ నుంచి 21.9శాతం వరకు ఉపశమనం కలిగింది. సాఫ్రన్ తీసుకున్న వారిలో 18.8శాతం ఉపమనం కనిపించినట్లు అధ్యయనంలో తేలింది. అంతేకాదు SSRIతీసుకున్న వారిలో తలనొప్పి, పొడినోరు, మలబద్ధకం వంటి దుష్ప్రభావాలను కనిపించాయి. కుంకుమపువ్వు తీసుకున్న వారిలో ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదట. కాబట్టి కుంకుమ పువ్వును ప్రసవానంతరం ఇవ్వడం ద్వారా ఎంతో సహాయపడుతుందని అధ్యయనం తేల్చింది.