డెలివరీ తర్వాత పొట్ట తగ్గించుకోవడం ఎలా…?
ప్రసవం తర్వాత తల్లులు తొందరగా మునుపటి ఆక్రుతికి చేరుకోవాలనుకుంటారు. గర్భం దాల్చింది మొదలు తొమ్మిది నెలల వరకు పొట్ట పెరుగుతుంటి. బిడ్డ పెరుగుదలను బట్టి పొట్ట పెరుగుతుంటి. అయితే డెలివరీ తర్వాత పొట్ట తిరిగి సాధారణ స్థితిలోకి రావాలి. కానీ చాలా మంది స్త్రీలకు డెలివరీ తర్వాత పొట్ట చాలా ఎత్తుగా కనిపిస్తుంది. ఎలాగంటే మళ్లీ గర్భం దాల్చారనే డౌట్ వచ్చేలా పొట్ట కనిపిస్తుంది. దీంతో చాలామంది స్త్రీలు అసౌకర్యంగా భావిస్తుంటారు. అయితే డెలివరీ తర్వాత పొట్టను తగ్గించుకోవడానికి కొన్ని సహజసిద్ధమైన పద్దతులు ఉన్నాయి. అవేంటో ఓ సారి చూద్దాం.
మెంతుల నీళ్ళు……
ఎనిమిది నుంచి పది గ్లాసులో నీటిలో ఒక టీస్పూన్ మెంతులను కలిపి రాత్రంతా నానబెట్టాలి. ఈ మెంతుల నీటిని ఉదయం వేడి చయాలి. తర్వాత వడకట్టిన నీళ్లను తాగాలి. ఇలా చేయడం ద్వారా శరీరంలో నుంచి అదనపు టాక్సిన్లను బయటకు తొలగించడంతో…గర్భధారణ సమయంలో శరీర కణజాలల వాపును కారణంగా చేరిన కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో మెంతుల నీళ్లు సహాయపడుతాయి.
పసుపు పాలు…..
ప్రసవం తర్వాత పసుపు వేసిన పాలు తాగించడం సాధారణ చిట్కా. పసుపు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. పొట్ట తగ్గిన నార్మల్ స్థితికి చేరుకునేందుకు సహాయపడుతుంది. అంతేకాదు ఉదర కండారాల రూపాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
బాదం…..
బాదంలో ఫైబర్ చాలా ఉంటుంది. ఫైబర్ యొక్క గొప్ప మూలం బాదం అని చెప్పవచ్చు. ఆకలివేయకుండా….కడుపు చాలా సమయం వరకు నిండుగా ఉండేందుకు బాదం ఉపయోపడుతుంది. డైరెక్టుగా గానీ, నానాబెట్టి కానీ పాలలో కలిపి గానీ తీసుకోవచ్చు.
వేడి నీరు….
ప్రసవించిన స్త్రీలు కొన్ని రోజుల వరకు వేడి నీటిని తాగిస్తుంటారు. గోరువెచ్చటినీటిని తీసుకున్నట్లయితే పొట్ట దగ్గరున్న కొలెస్ట్రాల్ ను వేగంగా తగ్గింస్తుంది.
మసాజ్…
డెలివరీ తర్వాత పొట్ట చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి పొట్టపై నెమ్మదిగా మసాజ్ చేసినట్లయితే కణజాల పునరుద్ధరణ ప్రక్రియ వేగవంతం అవుతుంది. దీంతో పొట్ట దగ్గర పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.