Reducing Bad Cholestrol: వెల్లుల్లి తింటే కొలెస్ట్రాల్ ఐస్ లా కరిగిపోతుంది…బీపీకి చెక్ పెట్టొచ్చు…ఎలాగో తెలుసా…!!

Reducing Bad Cholestrol: వెల్లుల్లి తింటే కొలెస్ట్రాల్ ఐస్ లా కరిగిపోతుంది…బీపీకి చెక్ పెట్టొచ్చు…ఎలాగో తెలుసా…!!

వెల్లుల్లిని భారతీయవంటకాల్లో రుచి, వాసన కోసం వాడుతుంటారు. వెల్లుల్లిలో ఎన్నో ఔషద గుణాలతోపాటు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వెల్లుల్లి ప్రతిరోజూ తీసుకున్నట్లయితే…బరువు తగ్గడంతోపాటు, అధిక కొలెస్ట్రాల్, అధిక బీపీని తగ్గించడానికి సహాయపడతుందని నిపుణులు అంటున్నారు. రోజుకు సగం వెల్లుల్లి రెబ్బను తిన్నట్లయితే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఐస్ లా కరిగిపోతుందని అధ్యయనాల్లో తేలింది.

ఈ రోజుల్లో చాలామంది అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నారు. చెడు ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్లో మార్పులు కారణంగా చాలా మంది అధిక కొలెస్ట్రాల్ తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే వెల్లుల్లి కేవలం రుచి కోసమే కాదు..జలుబు, ఫ్లూకి వ్యతిరేకంగా పోరాడుతూ…రోగనిరోధకశక్తిని పెంపొందించడంతోపాటు, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం, అధిక రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. అయితే వెల్లుల్లి వల్ల మీ ఆరోగ్యానికి సహాయపడే 7 మార్గాలు ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: నిద్ర మీ లైంగిక జీవితాన్ని ప్రభావితం చేస్తుందని మీకు తెలుసా?

వెల్లుల్లి 7 ఆరోగ్య ప్రయోజనాలు.

  1. రోగనిరోధకశక్తిని పెంచుతుంది:
    వెల్లుల్లి శరీర రోగనిరోధకశక్తిని పెంచుతుంది. ముఖ్యంగా జలుబు, ఫ్లూతో పోరాడటంతో సహాయపడుతుంది. పచ్చివెల్లుల్లిని తినడం వల్ల దగ్గు, జ్వరం, జలుబు నుంచి బయటపడవచ్చు. ప్రతి రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలను ఉదయం తిన్నట్లయితే అద్బుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. కొన్ని నివేదికల ప్రకారం వెల్లుల్లి లవంగాలను ఒక దారానికి కట్టి పిల్లల మెడకు వేలాడదీసినట్లయితే…జలుబు నుంచి ఉపశమనం లభిస్తుందని పేర్కొన్నాయి.
  2. అధిక రక్తపోటును తగ్గిస్తుంది:
    అధికరక్తపోటు గుండెపోటుతోపాటు దీర్ఘకాలిక గుండె వైఫల్యానికి ప్రధాన కారణం అవుతుంది. అంతేకాదు ఇది మూత్రపిండాలపై కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచడం చాలా ముఖ్యం. గుండెసంబంధిత వ్యాధులతోపాటు, అధికరక్తపోటుతో బాధపడేవారికి వెల్లుల్లి చక్కగా పనిచేస్తుంది. మీరు హైపర్ టెన్షన్ తో బాధపడుతుంటే మీ ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకోండి.
  3. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది:
    కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ LDL, మంచి కొలెస్ట్రాల్ HDL. LDLస్థాయి చాలా ఎక్కువగా HDLస్థాయి చాలా తక్కువగా ఉన్నట్లయితే…అది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. వెల్లుల్లి హెచ్ డిఎల్ స్థాయిలపై ఎలాంటి ప్రభావం చూపదు. అయినప్పటికీ ఇది ఎల్ డిఎల్ స్థాయిలను తగ్గిస్తుందని అధ్యయనాల్లో తేలింది. కాబట్టి వెల్లుల్లిని క్రమంగా తీసుకునేవారికి గుండె సంబంధిత వ్యాధులు రావు.
  4. యాంటీ ఆక్సిడెంట్లు :
    వెల్లుల్లిలో ఫ్లేవనాయిడ్స్ , పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. మీ కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి ఇది కాపాడుతుంది. క్యాన్సర్, డయాబెటిస్, అల్టీమర్స్, గుండె జబ్బులు వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
  5. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:
    మహిళల్లో ఈస్ట్రోజెన్ పెంచడం ద్వారా ఎముకల బలహీనతను తగ్గిస్తుంది. ఎముకల ఆరోగ్యంగా ఉంచడంలో వెల్లుల్లి ప్రముఖ పాత్ర పోషిస్తుందని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. ముఖ్యంగా మహిళలు ప్రతిరోజూ వెల్లుల్లిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
  6. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:
    వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు బ్యాక్టీరియాను కలిగించే మొటిమలను తొలగించడంలో సహాయపడతాయి. అయితే మీ చర్మానికి పచ్చి వెల్లుల్లిని మాత్రం పూయకండి. చర్మ నిపుణులను సంప్రదించి వారి సలహా మేరకు దీనిని ఉపయోగించాలి.
  7. కండరాల నొప్పికి :
    వెల్లుల్లిలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. వెల్లుల్లి నూనె తీసుకుని వాపు ఉన్న కీళ్లపై లేదా కండరాలపై నొప్పి ఉన్న ప్రాంతంలో పూయండి. అద్భుతమైన ప్రభావాన్ని చూస్తారు.

(నోట్ : ఈ ఆర్టికల్ ఇంటర్నెట్ సమాచారం ప్రకారం రాయబడింది. వైద్యనిపుణుల సలహాకు ప్రత్యామ్నాయం కాదు. దీనిని న్యూస్ వాయిస్ తెలుగు ధృవీకరించలేదు.)

Dont Miss Reading These Articles

Leave a Reply

Morning Digestion Tips: మంచి జీర్ణక్రియ కోసం ఈ చిట్కాలను పాటించండి Bigg Boss Subhashree Rayaguru: మీకు తన గురించి ఈ విషయాలు తెలుసా? How To Boost Platelet Count: 10 సహజ మార్గాలు Food Tips: ఈ 10 ఆహార పదార్ధలు మీ ఫ్రిజ్ లో నిల్వచేయకండి India vs Pakistan Asia Cup: భారత్-పాకిస్థాన్ ఆసియా కప్ చరిత్ర
%d