These Foods Helps Reduce Joint Pains: జాయింట్ పెయిన్స్ తో బాధపడుతున్నారా? అయితే ఈ ఫుడ్స్ తీసుకోండి!

ఎముకలు బలంగా, ధ్రుడంగా ఉండాలంటే వాటికి కావాల్సినంత పోషకాలను అందించాలి.ఎందుకంటే మనం తీసుకునే పోషకాలను మీదే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఆహారంతోపాటు జీవనశైలి కూడా మార్చుకోవాలి. అప్పుడే మన లైఫ్ ను మనం ఎంజాయ్ చేయవచ్చు.
ఇక బలమైన ఎముకల కోసం బోన్ డెన్సిటీని బిల్డ్ చేసే…కనెక్టివ్ టిష్యూని బలంగా చేసి..ఇన్ ఫ్లమేషన్ తగ్గించే ఆహారాన్ని తీసుకోవడం వల్ల గాయాలుకాకుండా, జాయింట్స్ ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాదు సంతోషంగా జీవించవచ్చు. మరి ఎముకలు బలంగా ఉండాలంటే ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలో తెలుసుకుందాం.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కోల్డ్ వాటర్ ఫిష్ లో పుష్కలంగా లభిస్తుంది. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఆరోగ్యానికి కావాల్సిన ఎస్సెన్షియల్ న్యూటియెంట్స్ ని అందిస్తాయి. వీటిని పాలి అన్ శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అని కూడా అంటారు. ఇది తీసుకున్నట్లయితే గుండెసంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తుంది. ఒమేగా 3 ట్యూనా,సాల్మన్, ట్రౌట్, సార్డీన్స్ వంటి కోల్డ్ వాటర్ ఫిష్ లో లభిస్తుంది.
నట్స్, సీడ్స్
శాఖహారులకు ఇది గుడ్ న్యూస్. ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ కొన్ని నట్స్, సీడ్స్ లో కూడా లభిస్తాయి. వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, ఆల్మండ్స్ వంటివి ప్రతిరోజూ తీసుకున్నట్లయితే…జాయింట్స్, కనెంటివ్ టిష్యూలో ఇన్ ఫ్లమేషన్ రెడ్యూస్ అవుతుంది.
బ్రాసికా కూరగాయాలు
బ్రాసిక కూరగాయాలు అంటే క్రూసిఫరస్ వెజిటెబుల్స్. ఇవి క్యాబేజీ ఫ్యామిలీకి చెందినవి అని చెబుతుంటారు. మస్టర్డ్ గ్రీన్స్,అరుగులు, కాలే, పర్పుల్ క్యాబేజీ వంటివి ఇందులో ఉంటాయి. బ్రకోలీ, బ్రసెస్ స్ప్రౌట్స్ కూడా ఉంటాయి. వీటిలో ఉండే ఒక ఎంజైమ్ మాత్రమే జాయింట్స్ వాపు రాకుండా చూస్తాయి. వీటిలో ఫైబర్, విటమిన్స్, న్యూట్రియెంట్స్ పుష్కలంగా ఉంటాయి.
ఫ్రూట్స్
పండ్లలో షుగర్ శాతం ఎక్కువగా ఉంటుందని….వాటిని ఎక్కువగా తినడానికి ఇష్టపడరు. కానీ వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. కూరగాయాల్లగానే పండ్లలో కూడా కొన్ని రకాల ఇన్ ఫ్లమేషన్ రెడ్యూస్ చేయడంలో సహాయపడుతాయి. ఈ లిస్టులో మొదటగా బ్లూ బెరిస్ ఉంటాయి. బ్లూ బెర్రీస్ లో యాంతో సియానిన్స్ అనే పవర్ ఫుల్ ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి శరీరంలో వచ్చే రెస్పాన్సెస్ ని తగ్గిస్తాయి.
ఆలివ్ ఆయిల్
సలాడ్స్ కోసం ఆలివ్ ఆయిల్ మాత్రమే వాడాలి. వీలైనంత వరకు వర్జిన్ ఆలివ్ ఆయిల్ వాడాటానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే ఇది అంతగా ప్రాసెస్ చేయని రకం. ఆలివ్ ఆయిల్ అన్ శాచ్యురేటెడ్ హెల్దీ ఫ్యాట్స్ లిస్టులో ఉంటుంది. దీన్ని ఎక్కువగా మెడిటరేనియన్ డైట్ లో వాడుతుంటారు.
పప్పులు
పప్పుల్లో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎస్సెన్షియల్ , ప్రొటిన్ కూడా అధికంగా ఉంటుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇంఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. పప్పుల్లో ఉండే యాంతో సియానిన్స్ ఇన్ ఫ్లమేషన్ని రెడ్యూస్ చేసేందుకు సహాయపడుతాయి.
వెల్లులి, దుంపలువెల్లుల్లి, ఉల్లి, అల్లం, పసుపు….వీటన్నింటికీ యాంటీ ఇంఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవి ఆర్ట్రరైటిస్, జాయింట్ పెయిన్స్ తగ్గించేందుకు సహాయపడుతాయి.
8. ధాన్యాలు
రిఫైండ్ గెయిన్స్ లో ప్రొటీన్ అధిక శాతం ఉంటుంది. బాడీలోని ఇన్ ఫ్లమేషన్ను పెంచుతుంది. హోల్ గ్రెయిన్స్ లో ఉండే ఫైబర్ ఫ్యాటీ యాసిడ్స్ ను ఉత్పత్తి చేస్తాయి. ఇన్ ఫ్లమేషన్ తో ఇవి పోరాడుతాయి.
బోన్ బ్రాత్
ఎముకల జాయింట్స్ బలంగా ఉండాలంటే బోన్ బ్రాత్ చాలా అవసరం. ఇది జాయింట్ పెయిన్స్ ను రెడ్యూస్ చేసి ఆర్థరైటిస్ తో బాధపడేవారు ఇంకాస్త మెరుగ్గా కదలగలిగేలా చేస్తుంది.
డార్క్ చాక్లెట్స్
చాక్లెట్స్ లో యాంటీ ఇన్ ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అధికంగా ఉంటాయి. చాక్లెట్లో ఉండే కొకోవాలో యాంటీ ఆక్సిడెంట్స్ వంశపార్యపరంగా వచ్చే ఇన్ ఫ్లమేషన్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తో పోరాడుతాయి. చాకొలేట్ లో ఎంత ఎక్కువ కొకోవా ఉంటే…..యాంటీ ఇన్ ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అంత తక్కువగా ఉంటాయి. అయితే చాక్లోటో లో షుగర్ తోపాటు ఫ్యాట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. కావాల్సినంతగా మాత్రమే తీసుకోవాలి.