Do not make these mistakes during pregnancy: గర్భధారణ సమయంలో ఈ పొరపాటు చేసినట్లయితే….మీకు పుట్టబోయే శిశువు జీవితానికి హాని కలిగిస్తుంది.

గర్భిణీలు చాలావరకు నిద్రలేమి రాత్రులు గడుపుతుంటారు. నిద్ర అనేది గొప్పవరం. రాత్రి మనశ్శాంతిగా నిద్రపోవడమనేది ఒక ఆశీర్వాదం. తల్లిబిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే దాదాపు ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి. అలా అని ఎక్కువ సమయం నిద్రపోవడం కూడా మంచిది కాదంటున్నాయి అధ్యయనాలు. తొమ్మిది గంటల కంటే ఎక్కువ సమయం నిద్రించినట్లయితే…మీ శిశువు ఆరోగ్యానికి హాని జరుగుతుందని చెబుతున్నాయి. అయితే గర్భిణీలు ఎంత సమయం విశ్రాంతి తీసుకోవాలి..అనే విషయాన్ని తెలుసుకుందాం.
గర్భధారణ సమయంలో ఎందుకు అధిక నిద్ర వస్తుంది
పెరుగుతున్న పొట్ట, ఆందోళన, ఒత్తిడి కారణంగా గర్భధారణ సమయంలో శారీరక అసౌకర్యం ఉంటుంది. ఈ సమస్యలు గర్భిణీ స్త్రీలో నిద్ర భంగం కలిగిస్తాయి. దీంతో ఎక్కుమ సమయం నిద్రపోవడానికి కారణమవుతుంది. ఇవే కాదు కొన్ని సాధారణ కారణాలు కూడా ఉన్నాయి.
హార్మోన్స్ హెచ్చుతగ్గులు
హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల తల్లులో నిద్రలేమి సమస్యలను రేకెత్తిస్తాయి. ప్రొజెస్టెరాన్ స్థాయిలను పెంచడంతోపాటు రక్తంలో చక్కెర, రక్తపోటు స్థాయిలను తగ్గించడం తద్వారా అలసటకు దారితీస్తుంది. దీంతో గర్భిణీలు ఎక్కువ సమయం నిద్రపోవాలని కోరుకుంటారు.
గ్యాస్ట్రోసోఫాగియల్ రిప్లెక్స్ వ్యాధి
ప్రెగ్నెన్సీ సమయంలో….ఇది ఉదరంలోని ఒత్తిడికి గురిచేస్తుంది. ఆహారవాహిక బేస్ వద్ద వదులుగా కండరాల వలయాలు ఉన్న మహిళలకు ఇది ఒక సాధారణ సమస్య అని చెప్పవచ్చు. ఇది కడుపులోకి ఆహారాన్ని తీసుకువస్తుంది. యాసిడ్ రిప్లెక్స్ , గొంతులోకి ద్రవం తిరిగి వచ్చేందుకు సహాకరిస్తుంది. దీంతో మీరు పడుకున్నప్పుడు మీ నిద్రకు అంతరాయం కలిగిస్తుంది.
రెస్ట్ లెస్ ఫుట్ సిండ్రోమ్
చాలామంది గర్భిణీలు తమ కాళ్లను కదిలించాలన్న నిరంతర కోరకతో నిద్ర భంగం కలిగిస్తారు. ఇది ఈ స్ట్రోజన్ స్థాయిల పెరుగుదలను లేదా ఫోలిక్ అమ్లం, ఐరన్ లేకపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది.
తరచూ మూత్ర విసర్జన
మొదటి, మూడవ నెలలో తరచుగా మూత్ర విసర్జన చేయాలనే భావన కలుగుతుంది. దీంతో చాలా మంది మహిళలు ప్రశాంతంగా నిద్రపోలేరు. పెరుగుతున్న పొట్ట మూత్రాశయంపై రాపిడి జరపడంతో ఇలా సమస్య ఎదురవుతుంది.
ప్రెగ్నెన్సీ సమయంలో ప్రశాంతమైన నిద్ర కోసం చిట్కాలు
ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. శారీరక శ్రమను పొందినట్లయితే…సుఖవంతమైన నిద్రను పొందవచ్చు. అంతేకాదు గర్భాదారణలో వచ్చే షుగర్, బీపీ, వంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.
ఆందోళన
మీరు డెలివరీ అయిన తర్వాత…మీ జీవితం గురించి ఎక్కువగా ఆందోళన చెందకండి. ఒకవేళ అలాంటి పరిస్థితి ఏర్పడినట్లయితే….మీ వైద్యుడితో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోండి.
ప్రణాళికను రూపొందించుకోవడం
ప్రశాంతమైన నిద్రను పొందాలనుకుంటే…మీరు ఒక ప్రణాళికను రూపొందించుకోవాలి. టైం ప్రకారం నిద్రపోవడం, మేల్కోనడంలో మీకు సహాయపడుతుంది. అంతేకాదు పడుకునేముందు, మేల్కొన్నాక దాదాపు 30 నిమిషాలపాటు గాడ్జెట్లకు దూరంగా ఉండటం మంచిది.