Children covid :ఈ విపత్కర పరిస్థితుల్లో మీ పిల్లలు భద్రం!

కరోనా సెకండ్ వేవ్ ఉప్పెనలా విజృంభిస్తోంది. ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఎవరితో మాట్లాడాలన్నా…ఎక్కడికైనా వెళ్లాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా యువతే ఎక్కువగా కరోనా బారినపడుతుండటం కలవరపెడుతోంది. అయితే పిల్లలకు కరోనా వస్తుందా అనే సందేహం చాలా మందిలో ఉంది. పిల్లల్లో రోగనిరోధకశక్తి ఎక్కువగా ఉంటుంది వారికి రాదనే అపోహ కరోనా మొదటిదశలో ఉండేది. కానీ సెకండ్ వేవ్ లో పిల్లలే కరోనా క్యారియర్స్ గా మారుతున్నారు. ఈ విపత్కార పరిస్థితుల్లో పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. వైరస్ సోకకుండా తగిన చర్యలు తీసుకోవాలి. స్కూల్లు ఎలాగో మూతబడ్డాయి. రోజంతా ఇంట్లోనే ఉంటున్నారు. వారి అల్లరిచేష్టలు తల్లిదండ్రులకు కోపం తెప్పిస్తాయి. వారి అల్లరితోపాటు కరోనా నుంచి రక్షించుకోవడం తల్లిదండ్రులకు పెద్ద టాస్క్ అని చెప్పాలి.
చదవండి: 102 ఏళ్ల బామ్మ దెబ్బకు… కరోనా ఔట్
పిల్లలు ఎక్కువగా మారం చేస్తున్నారని…వారు అడిగిందల్లా కొనివ్వడం….బయటకు తీసుకెళ్లడం లాంటి చర్యలు మానుకోవాలి. ఎందుకంటే వారి ఆరోగ్యంపై ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉంది. చిన్నారుల కదలికలపై ఎప్పకటిప్పుడు పర్యవేక్షణ లేకపోతే చాలా ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బయటకు వెళ్లి ఆటలో పడితే…శుభ్రతను మరిచిపోతారు. ఎక్కడపడితే అక్కడ చేతులతో తాకడం, చేతులను కండ్లు, ముక్కు, నోరును పట్టుకోవడం చేస్తుంటారు. దీంతో వైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించాలి. వారిని అత్యవసరం అయితే తప్పా బయటకు తీసుకెళ్లకూడదు. సమయం దొరికిందని….పిల్లలు ఫోన్లు, కంప్యూటర్లకు అతుక్కుపోతుంటారు. అలా చేయోద్దని వారితో వారించాలి. పాఠ్యపుస్తకాలను ఎక్కువగా చదివేలా ప్రోత్సహించాలి. వీటితోపాటు చెస్,క్యారమ్, వంటి ఆటలను ఇంట్లోనే ఆడుకునేలా సదుపాయాలు కల్పించాలి. కరోనా వైరస్ గురించి వారి వివరించాలి. శానిటైజ్ చేసుకోవడం, మాస్క్ ధరించడం వంటివి చెబుతుండాలి. బయట ఫుడ్ జోలికి అస్సలు వెళ్లకూడదు. ఇంట్లోనే తయారు చేసుకున్న పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. దగ్గు, జ్వరం, జలుబు, నీరసంగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి. అంతేకాని సొంత వైద్యం పనికిరాదు.