Reduce Hair Fall : జుట్టు రాలడం తగ్గాలంటే… ఈ చిన్న మార్పు సరిపోతుంది!

ఈ మధ్యకాలంలో జుట్టు రాలే సమస్యను ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్నారు. మహిళలు, పురుషులకు జుట్టు రాలడం సాధారణమైంది. అందమైన, ఒత్తైన జుట్టు ఉండాలని ఎవరూ కోరుకోరు చెప్పండి. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, నీరు, రసాయనాల వినియోగం మన ఆరోగ్యాన్నే కాదు జుట్టును కూడా పాడుచేస్తుంది. తల దవ్విన ప్రతిసారీ ఊడిన జుట్టును చూసుకుని….చాలా మంది ఆందోళన చెందుతుంటారు.
ఇక కొంత మందికి బట్టతల ఏర్పడుతుందేమోనన్న భయం వెంటాడుతుంది. అయితే పురుషులకు బట్టతల అనేది వయస్సు వచ్చాక అతిపెద్ద సమస్య. రోజుకు దాదాపు వంద వెంట్రుకలు కోల్పోవడం సాధారణం. అయితే వందకంటే ఎక్కువగా వెంట్రుకలు ఊడిపోయినట్లయితే…రోజువారీ జీవిశైలిని ఓసారి జాగ్రత్తగా పరిశీలించాలి. ఇప్పుడు జుట్టు ఎందుకు రాలుతుంది…జుట్టు రాలడం తగ్గించడానికి తీసుకోవల్సిన జాగ్రత్తలు…..కొన్ని కొన్ని జీవనశైలి మార్పుల గురించి తెలుసుకుందాం.
కండీషనర్
కండీషనర్ మీ జుట్టుకు అద్భుతాలు చేస్తుంది. కానీ అది మంచి క్వాలిటీ కండీషనర్ అయి ఉండాలి. దెబ్బతిన్న జుట్టుకు తిరిగి పూర్వవైభవం తీసుకువచ్చే…అమైనో ఆమ్లాలు ఇందులో ఎన్నో ఉన్నాయి. అవి మీ జుట్టను మెత్తగా ఉంచేందుకు సహాయపడుతాయి.
షాంపూ
మొదట మీ చర్మం గుణాన్ని తెలుసుకున్నాకే….సరైన షాంపూని సెలక్ట్ చేసుకోవాలి. మీ జుట్టు గుణాన్ని బట్టి షాంపూతో జుట్టు కడగాలి. పొడి జుట్టుతో తలస్నానం చేసినట్లయితే జుట్టు రాలుతుంది. అంతేకాదు వారానికి రెండు నుంచి మూడు సార్లు నూనెతో మర్దన చేయాలి. ఇలా చేయకపోవడం వల్ల వెంట్రుకలు ఊడిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇక ఎక్కువ శాతం రసాయనాలు ఉన్న షాంపూ కాకుండా నేచురల్ గా ఉండే వాటిని ఎంపిక చేసుకోండి. ఎందుకంటే…సల్ఫేట్, పారాబెన్, సిలికాన్ వంటి రసాయనాలు మీ జుట్టును పెళుసుగా చేస్తాయి.
ఆహారం, వ్యాయామం
మీరు ఎంతమంచి ఆహారం తీసుకున్నారన్నది ముఖ్యం కాదు. ఆహారంతోపాటు వ్యాయామం తప్పనిసరి. సమతుల్య ఆహారం తీసుకుని….వ్యాయామం చేయకుంటే దాని విలువ రుజువుకాదు. మీరు రోజు తీసుకునే ఆహారంలో ప్రొటీన్, ఐరన్ పుష్కలంగా ఉండేలా చూసుకోండి. జుట్టు రాలుటను తగ్గించడానికి వ్యాయామం, యోగా, ధ్యానం వంటివి ఉత్తమ మార్గాలు అని చెప్పవచ్చు.
రసాయన చికిత్సలు
మీ జుట్టుకు ఎక్కువగా రసాయనాలు వాడటం మానుకోండి. హెయిర్ కట్, లేయర కట్, హెయిర్ కలరింగ్ వంటివి రసాయాలతో ముడిపడి ఉంటాయి కాబట్టి …అవి మీ జుట్టును మరింత ఊడిపోయోలా చేస్తాయి. ఇక ముఖ్యంగా తడి జుట్టుతో ఫుట్ డ్రైయర్స్, కర్లింగ్ ఐరన్స్ వంటివి పూర్తిగా మానుకోండి. ఎందుకుంటే ఇవ్వన్నీ కూడా వేడిచేసే ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. మంచి లీవ్ ఇన్ కండీషనర్ తో జుట్టును కాపాడుకోండి.
సాధారణ ట్రిమ్ లను పొందండి
మీ చాలా దెబ్బతిన్నట్లయితే…ప్రతి ఆరు నుంచి ఎనిమిది వారాలకోసారి ట్రిమ్ చేసినట్లయితే…మీ ప్రాబ్లమ్స్ ను పరిష్కరించడంలో సహాయపడుతుంది. దెబ్బతిన్న జుట్టు పెళుసుగా….కనిపిస్తుంది. అంతేకాదు పెరుగుదల కూడా ఉండదు. జుట్టు పెరగాలంటే స్ల్పిట్స్ చివరలను కత్తిరించినట్లయితే ఫలితం ఉంటుంది.
ఆయిల్
వారానికి మూడు నుంచి నాలుగు సార్లు తలకు నూనెతో మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల రక్తప్రసరణ సరిగ్గా జరుగుతుంది. జుట్టుకు నునెను పట్టించిన తర్వాత…తేలికపాటి షాంపూతో తలస్నానం చేయండి. మంచి ఫలితం ఉంటుంది.
ముగింపు
జుట్టుకు ఇంట్లోనే తయారు చేసుకునే నేచరల్ షాంపూలను వాడినట్లయితే…సమస్య కొంతవరకు తగ్గుతుంది. వీటితోపాటు ఆందోళన, ఒత్తిడి లాంటివి తగ్గించుకోవాలి.