సెల్‌ఫోన్ వాడొద్దన్నందుకు…పదవ తరగతి విద్యార్థి దారుణం!
సెల్‌ఫోన్ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. సెల్‌ఫోన్ ఎక్కవగా వాడొద్దన్నందుకు ఓ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని తాడిపత్రిలో జరిగింది. ఆర్‌ఆర్ నగర్ కు చెందిన సుబ్బురాయుడు, లక్ష్మీ దంపతుల కుమారుడు శ్రీనివాసులు పుట్లూరులోని ఆదర్శ స్కూల్లో పదవ తరగతి చదువుతున్నాడు.
శ్రీనివాస్ కు తండ్రి లేడు. కొన్ని సంవత్సరాల క్రితం మరణించాడు. తల్లి లక్ష్మీ అన్నీ తానై కుమారుడ్ని పెంచుతోంది. అయితే ఈ మధ్య కాలంలో శ్రీనివాస్ సెల్‌ఫోన్ ఎక్కువగా వాడుతున్నాడని…చదువుకోవాల్సిన సమయాన్ని వృథా చేస్తున్నాడని తల్లి మందలించింది. దీంతో మనస్థాపం చెందిన శ్రీనివాస్ పుట్లూరు రోడ్డు రైల్వే క్రాసింగ్ దగ్గర ట్రైన్ కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న రైల్వే జీఆర్ఫీఎఫ్ పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టు కోసం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.