Shocking incident in Vizag: ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు హత్య..విశాఖలో దారుణం!

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో దారుణం చోటుచేసుకుంది. పెందుర్తి మండలం జుత్తాడలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగుర్ని అతికిరాతకంగా హత్య చేశారు. వీరిని హత్య చేసింది అప్పలరాజుగా గుర్తించారు. పాత కక్షలతోనే ఆరుగుర్ని హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. చనిపోయినవారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. నిద్రలో ఉన్నవారిపై అప్పలరాజు దాడి చేసినట్లు తెలుస్తోంది. అందరూ రక్తపు మడుగులో పడి ఉన్నారు. వివరాళ్లోకి వెళ్తే… మరణించినవారు రామారావు, ఉషారాణి, రమాదేవి, అరుణ, ఉదయ్, ఊర్విశిలుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.
ఈ హత్యలకు కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్న అప్పలరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అప్పలరాజు అదే గ్రామానికి చెందివాడని పోలీసులు తెలిపారు. మ్రుతుల కుటుంబానికి అప్పలరాజుకు రాత్రి గొడవ జరిగిందని….ఆ తర్వాతే అప్పలరాజు వారిని కిరాతకంగా చంపేసినట్లు స్థానికులు చెబుతున్నారు. పాతకక్షలు, ఆస్తి తగాదాలే ఈ హత్యలకు కారణమని పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. విచారణలో మరిన్ని కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశముంది. ఒకే కుటుంబంలో ఆరుగురిని హత్య చేయడంతో ఆ గ్రామంలో తీవ్ర కలకలం రేగింది.
మరోవైపు మధురవాడలో ఉన్న ఆదిత్య ఫార్చున్ టవర్ లోని ఓ ఫ్లాట్లో ఒకే కుటంబానికి చెందిన నలుగురు మరణించారు. అగ్నిప్రమాదంలో మరణించారని అందరూ భావిస్తున్నప్పటికీ చుట్టూ రక్తపు మరకలు ఉండటంతో అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఆదిత్య ఫార్చూన్ టవర్ లోని ఫ్లాట్ నెంబర్ 505లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మరణించిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ నలుగుర్ని ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మొత్తంగా విశాఖపట్నంలో జరిగిన ఈ రెండు దారుణ ఘటనల్లో మొత్తం 10మంది ప్రాణాలు కోల్పోయారు.