Delhi hit kanjhawala death case update : ఢిల్లీ ఘటనలో కొత్త సంచలనాలు

దేశ రాజధాని న్యూఢిల్లీ అట్టుడికిపోతోంది. కంజావాలా ప్రాంతంలో నూతన సంవత్సరం రోజున అంజలీ అనే యువతిని ఓ కారు ఢీకొట్టి 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సీసీకెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ఆధారంగా కారును గుర్తించారు. అందులోని ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే యువతి మరణంపై పలు అనుమనాలు వ్యక్తమవుతున్నాయి.
తాజాగా ఈ కేసులో మరో సంచలనాత్మక విషయం వెలుగులోకి వచ్చింది. ఘటన జరిగిన సమయంలో స్కూటీపై అంజలితో పాటు మరో యువతి కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా చేపట్టిన విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రత్యక్ష సాక్షులు కూడా స్కూటీపై మరో అమ్మాయి ఉన్నట్లు పోలీసులకు వెల్లడించారు. కారుతో ఢీకొట్టడంతో ఆమెకు గాయాలయ్యాయన్నారు. అనంతరం ఆ యువతి అక్కడి నుంచి పారిపోయిందని తెలిపారు.
మరోవైపు బాధితురాలు అంజలిపై అత్యాచారం చేసి ప్రమాదంగా చిత్రీకరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పడు వెలుగులోకి వచ్చిన మరో యువతి వాంగ్మూళం కీలకం కానుంది. సదరు యువతి ఆచూకీని గుర్తించి స్టేట్‌మెంట్ తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు ఢిల్లీ పోలీసులు.
ఇక కారుతో ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన దారుణ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన యువతి ప్రాణాలు కోల్పోయి రహదారిపై నగ్న స్థితిలో కనిపించిందని పోలీసులు తెలిపారు. పోలీసులు తొలుత దీన్ని రోడ్డు ప్రమాదమని ప్రకటించారు. అయితే ఆ తర్వాత అనేక అనుమానాలు తలెత్తాయి. కారులో ఉన్న వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే ఆ యువతిని కారుతో గుద్ది ఈడ్చుకెళ్లారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గంట పాటు రోడ్డుపై కారును అలాగే నడిపారని దీపక్ అనే ప్రత్యక్ష సాక్షి చెప్పాడు. కారు రోడ్డుపై పోలీస్ బారికేడ్లు చూసి యూటర్న్ తీసుకోవడం చూశానని మరో సాక్షి తెలిపాడు. ఆ సమయంలో కారు ముందు భాగంలో యువతి మృతదేహం చూసినట్లు చెప్పాడు. బాధితురాలిని కారుతో ఈడ్చుకెళ్తున్న సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఢిల్లీ బఘటనపై కేంద్ర హోం శాఖ అధికారులు కూడా స్పందించారు. పూర్తి వివరాలతో కూడిన నివేదికను అందించాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించారు. ప్రత్యేక మెడికల్ బోర్డు ఆధ్వర్యంలో బాధితురాలి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసినట్లు పోలీసులు ప్రకటించారు. ఈ నివేదిక ఆధారంగా నిందితులపై మరిన్ని సెక్షన్లు నమోదు చేయనున్నారు. అరెస్టైన ఐదుగురు నిందితులకు కోర్టు 3 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఈ ఘటన జరిగిన రోజు తాము మద్యం తాగి ఉన్నట్లు నిందితులు అంగీకరించారు. యువతి శరీరం కారు ముందు భాగంలో ఇరుక్కుపోయిన విషయం తమకు తెలియదన్నారు. అలాగే వాహనాన్ని నడిపినట్లు పోలీసులకు తెలిపారు నిందితులు.
మరో వైపు ఈ ఘటనపై మరణించిన యువతి కుటుంబసభ్యులు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. తమ బిడ్డకు న్యాయం జరగాలంటూ రోదించారు. తమ కుమార్తె శరీరం పూర్తిగా నగ్నంగా ఎందుకు ఉందని ప్రశ్నించారు..? ఇది ఏ తరహా ప్రమాదమో చెప్పాలని ప్రజా సంఘాలు, ఆప్ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. నిందితుల్లో ఒకరు బీజేపీ నేత అని ఆప్ నేతలు ఆరోపించారు.
#WATCH | Kanjhawala death case: CCTV footage of that night shows the presence of another girl with the girl who died after being dragged for a few kilometres by a car that hit her in Sultanpuri area.
— ANI (@ANI) January 3, 2023
(CCTV visuals confirmed by police) pic.twitter.com/nd1NUBQVze