Crime: హైదరాబాద్ లో ఘోరం….భర్త అప్పు తీర్చలేదని భార్యను చంపారు!

హైదరాబాద్ నడిబొడ్డున దారుణం జరిగింది. భర్త చేసిన అప్పు ఇల్లాలి ప్రాణాలమీదకు తెచ్చింది. ఈ ఘాతుకానికి పాల్పడిన ఆరుగురి నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ ఘటన సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే…సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో పరిమళ్ కుమార్ అనే వ్యక్తి మెడికల్ బిజినెస్ చేస్తుండేవాడు. అతను తెలిసిన వారి నుంచి 30లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు.
రెండు సంవత్సరాలు గడుస్తున్నా….తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వడంలేదు. దీంతో…అప్పు ఇచ్చినవాళ్లు పరిమళ్ తండ్రి దినేశ్ ను అడిగారు. అంతనుంచి ఎలాంటి స్పందనలేదు. అయితే ఇలా జరుగుతుండగానే సంవత్సరం క్రితం నుంచి పరిమళ్ కనిపించకుండా పోయాడు. అప్పుల బాధ నుంచి తప్పించుకోవడానికి ఉన్న ఇంటిని కూడా ఖాళీ చేసే…వేరే ఇంటికి మారాడు.
ఈ విషయాన్ని తెలుసుకున్న అప్పు ఇచ్చినవారు పరిమళ్ కొత్తింటికి వెళ్లారు. ఆ సయమంలో పరిమళ్ భార్య మంజుల, ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉన్నారు. అప్పు గొడవ జరుగుతుందని…పిల్లలకు, అపార్ట్ మెంట్ వాసులకు తెలిస్తే బాగుండదని…వారిని తీసుకుని మంజుల కిందికి వచ్చింది.
తన భర్త తనతో కలిసి ఉండటంలేదని….అతనికి సంబంధించి ఎలాంటి సమాచారం తెలియదని చెప్పడంతో….తీవ్ర ఆగ్రహానికి గురైన ఇమ్రాన్ ( అప్పు ఇచ్చిన వ్యక్తి పంపించిన మనిషి) కత్తితో పొడిచి తీవ్రంగా గాయపరిచారు. ఘటనాస్థలంలోనే మంజుల మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు….నిందితులను పట్టుకుని కేసు నమోదు చేసి…వారిని విచారిస్తున్నారు. భర్త అప్పు చేస్తే….భార్య ప్రాణాలు తీయడమేంటి? ఈ ఘోరంతో అభంశుభం తెలియని పిల్లలు అనాథలయ్యారు.