Delhi: ఢిల్లీలోని శాస్త్రి పార్క్‌లో మస్కిటో కాయిల్‌తో మంటలు చెలరేగడంతో ఊపిరాడక ఆరుగురు మృతి

ఢిల్లీలోని శాస్త్రి పార్క్ ప్రాంతంలోని ఒక కుటుంబానికి చెందిన ఆరుగురు సభ్యులు రాత్రిపూట కాలిపోయిన మస్కిటో కాయిల్ నుండి విడుదలైన విష వాయువును పీల్చడంతో ఊపిరాడక మరణించారు.
రాత్రి సమయంలో కుటుంబ సభ్యుల ఇంటిలోని మెట్రెస్‌పై మండుతున్న మస్కిటో కాయిల్ పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. విషపు పొగలు రావడంతో బాధితులు స్పృహ కోల్పోయారు. అనంతరం ఊపిరాడక చనిపోయారు.
ఈ ఘటనలో ఓ మహిళ, ఏడాదిన్నర చిన్నారి సహా ఆరుగురు మృతి చెందారు.
కాగా, 15 ఏళ్ల బాలికతో సహా మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించి కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నారు. 22 ఏళ్ల వయసున్న మరో వ్యక్తి ప్రథమ చికిత్స అనంతరం డిశ్చార్జి అయ్యాడు