మహారాష్ట్రలో విషాదం…జనరేటర్ పేలి వధువువరులు సహా ఆరుగురు మృతి

మహారాష్ట్రలో విషాదఘటన చోటుచేసుకుంది. పెళ్లిలో జనరేటర్ పేలీ వధువు వరుడుతోపాటు మొత్తం ఆరుగురు మరణించారు. జనలరేటర్ పేలిన ఘటనలో గదిలోపొగ నిండిపోయింది. శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడి ఆరుగురు దర్మరణం చెందారు.
ఎస్పీ అరవింద్ సాల్వే తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చంద్రాపూర్ పట్ణణ సమీపంలోదుర్గాపూర్ గ్రామవాసి రమేష్ లష్కరే గుత్తదారుగా పనిచేస్తున్నారు. ఆయన కుమారుడు అజయ్ వివాహం పదిరోజుల కిందట అదే గ్రామానికి చెందిన మాధురితో నిర్వహించారు. రెండు రోజుల కిందట కోడలిని వాళ్ల ఇంటికి తీసుకొచ్చారు. కొత్తగా కోడలు రావడంతో ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది. సోమవారం రాత్రి భారీగా వర్షం కురవడంతో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.
అయితే పెళ్లి కోసమని గతంలోనే అద్దె తీసుకున్న జనరేటర్ ఇంట్లో ఉండటంతో దాన్ని స్టార్ట్ చేశారు. భోజనాలు చేసి అంతా నిద్రపోయారు. అర్థరాత్రి సమయంలో జనరేటర్ పేలిపోయింది. పేలుడుకు వచ్చినపొగతో ఊపరి ఆడక ఆరుగురు మరణించారు. రమేష్ లష్కరే, వారు కుమారు అజయ్, కోడలు మాధురి వరుడి తోబుట్టువులు, పూజ లఖన్, క్రుష్ణ ఘటనా స్థలంలోనే మరణించారు. అజయ్ బాబాయ్ బీసు లష్కర్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.