Upcoming Cars in Januray 2023: కొత్త సంవత్సరంలో సరికొత్త కార్లు, జనవరిలో లాంచ్ కాబోయే వాహనాలు ఇవే!

కొత్త సంవత్సరంలో ఆటో కంపెనీలు సరికొత్త కార్లు విడుదలకు రెడీ అవుతున్నాయి. మూడేళ్ల తర్వాత ఢిల్లీ ఆటో ఎక్స్ పో ప్రారంభం కాబోతోంది. ఇందులో పలు నూతన కార్లు విడుదల కానున్నాయి. SUVలు మొదలుకొని ఎలక్ట్రిక్, లగ్జరీ కార్ల వరకు మార్కెట్లోకి అడుగు పెట్టబోతున్నాయి. జనవరిలోనే సుమారు 10కి పైగా కార్లు అందుబాటులోకి రాబోతున్నాయి. ఇంతకీ అవేంటో ఇప్పుడు చూద్దాం..
కొత్త MG హెక్టర్
మోరిస్ గ్యారేజెస్ ఇండియా ఈ నెలలోనే కొత్త హెక్టర్ SUVని విడుదల చేస్తుంది. కొత్త సంవత్సరంలో అమ్మకాలు జరుపుకొనే మొదటి కార్లలో ఇది ఒకటి. కొత్త హెక్టర్ సరికొత్త ఫీచర్లతో పాటు లేటెస్ట్ టెక్నాలజీతో అందుబాటులోకి రానుంది. కొత్త హెక్టర్ క్యాబిన్‌ను ఇప్పటికే వెల్లడించింది. క్లీనర్ లేఅవుట్ తో పాటు 14-అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ ప్లే తో వస్తుంది. ఇంజిన్ కు సంబంధించిన వివరాలు బయటకు రాలేదు. అయినప్పటికీ హెక్టర్ ఫేస్ లిఫ్ట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. 2.0-లీటర్ డీజిల్, 1.5-లీటర్ పెట్రోల్ వేరియెంట్లలో వస్తుందని తెలుస్తోంది.
మహీంద్రా థార్ 2WD
మహీంద్రా కూడా ఈ నెలలో థార్ టూ-వీల్ డ్రైవ్ (2WD) వెర్షన్‌ను తీసుకువస్తుంది. జనవరిలోనే ఈ SUV అమ్మకాలు మొదలయ్యే అవకాశం ఉంది. ఈ SUVలు ఇప్పటికే కొన్ని డీలర్‌షిప్‌లకు చేరుకున్నాయి. ఈ SUV చిన్న 1.5-లీటర్ డీజిల్ మోటారుతో సహా కొత్త ఇంజన్‌లతో వస్తుంది. మరిన్ని వివరాలు దాని లాంచ్ సమయంలో విడుదల చేయబడతాయి.
మహీంద్రా XUV400
ఈ నెలలోనే మహీంద్రా ఆల్-ఎలక్ట్రిక్ XUV400ని కూడా విడుదల చేయనుంది. భారత్ లో ఇప్పటికే విక్రయించబడుతు XUV300 ఆధారంగా, మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్ SUV సబ్‌కాంపాక్ట్ తో పోల్చితే లేటెస్ట్ డిజైన్, స్టైలింగ్‌తో వస్తుంది. ఆల్-ఎలక్ట్రిక్ XUV400 39.4 kWh బ్యాటరీ ప్యాక్‌తో జత చేయబడిన 148 bhp ఎలక్ట్రిక్ మోటారు ద్వారా శక్తిని పొందుతుంది. ఎలక్ట్రిక్ మోటార్ 310 Nm యొక్క గరిష్ట టార్క్ అవుట్‌పుట్‌ను కలిగి ఉంది. ఈ SUVని 8.3 సెకన్లలో 100 kmph వేగాన్ని అందుకోగలదు. మహీంద్రా XUV400 ఒక్క ఛార్జ్‌కి 456 కిమీల పరిధిని పొందే అవకాశం ఉంటుంది. సింగిల్ పెడల్ డ్రైవ్ ఫీచర్‌తో వస్తుంది. ఈ నెలలోనే విడుదల కావడంతో పాటు డెలివరీలు మొదలవుతాయి.
హ్యుందాయ్ IONIQ 5
హ్యుందాయ్ ఇండియా కూడా తన ఫ్లాగ్ షిప్ ఎలక్ట్రిక్ SUV, IONIQ 5, ఈ నెలలో జరిగి ఆటో ఎక్స్‌పోలో విడుదల చేయనుంది. IONIQ 5 E-GMP ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడింది. ప్రపంచ వ్యాప్తంగా, IONIQ 5 రెండు వేరియంట్‌లలో అందుబాటులోకి రాబోతోంది. 58 kWh బ్యాటరీ ప్యాక్ వెర్షన్, 72.6 kWh బ్యాటరీ వెర్షన్ లో విడుదలకానుంది.
సిట్రోయెన్ ëC3 ఎలక్ట్రిక్
సిట్రోయెన్ కూడా తన మొదటి ఎలక్ట్రిక్ కారు ëC3 ఎలక్ట్రిక్ హ్యాచ్ బ్యాక్‌ను ఈ నెలలో విడుదల చేయనుంది. భారత్ లో ఈ కంపెనీ నుంచి విడుదల అవుతున్న తొలి వాహనం ఇదేజ ëC3 ఎలక్ట్రిక్ పెట్రోల్‌తో నడిచే C3 లాగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన ఎలాంటి వివరాలు బయటకు రాలేదు.
Mercedes-AMG E 53 Cabriolet 4Matic+
లగ్జరీ కార్ బ్రాండ్‌లలో, మెర్సిడెస్-బెంజ్ ఇండియా ఈ నెలలోనే తొలి కారును విడుదల చేయబోతోంది. మెర్సిడెస్-AMG E 53 క్యాబ్రియోలెట్ 4మ్యాటిక్+ పేరుతో అందుబాటులోకి రాబోతోంది. ఈ కారు జనవరి 6న లాంచ్ కానుంది. ఇది పూర్తిగా బిల్ట్ అప్ (CBU) మోడల్‌గా వస్తుంది. కొత్త తరం Mercedes-AMG E53 Cabriolet 4Matic+ అత్యంత శక్తివంత శక్తివంతమైన వాహనంగా అందుబాటులోకి రాబోతోంది. తేలికపాటి-హైబ్రిడ్ అవతార్‌లో 3.0-లీటర్, ఇన్-లైన్ సిక్స్-సిలిండర్ ట్విన్-టర్బో పెట్రోల్ మోటారుతో వస్తోంది. ఇంజన్ 429 bhp, 520 Nm టార్క్‌ను అందిస్తోంది.
BMW X1
కొత్త-తరం BMW X1 గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. ఈ నెలలో భారత్ లో SUVని విడుదల చేయబోతోంది. ముందుకారుతో పోల్చితే కొత్త-జెన్ X1 పరిమాణం పెరిగింది. కొత్త డిజైన్, స్టైలింగ్‌తో వస్తుంది.
BMW 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ ఫేస్‌లిఫ్ట్
BMW ఇండియా కూడా జనవరిలో కొత్త మోడళ్లను విడుదల చేయనుంది. ఇందులో 2023 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ ఫేస్‌లిఫ్ట్ కూడా ఉంది. రాబోయే సెడాన్ స్టైలిష్ క్యాబిన్‌తో పాటు రిఫ్రెష్డ్ డిజైన్, స్టైలింగ్‌తో వస్తుంది. అప్‌డేట్ చేయబడిన 3 సిరీస్ గ్రిల్, రీవర్క్డ్ హెడ్ ల్యాంప్‌లు, బంపర్‌లతో సూపర్ డిజైన్‌ను పొందింది. ఇంజన్ల పరంగా ఈ కారు నాలుగు-సిలిండర్ పెట్రోల్, డీజిల్ ఇంజన్‌లతో రాబోతున్నట్లు తెలుస్తోంది. జనవరి 7న BMW జాయ్ టౌన్ ఈవెంట్‌లో ఈ కార్లు లాంచ్ చేయబడతాయి.
BMW 7 సిరీస్ & i7
BMW తన ఫ్లాగ్‌షిప్ లిమోసిన్ కొత్త తరం 7 సిరీస్‌ను ఈ నెలలో దేశీయ మార్కెట్లో విడుదల చేయనుంది. కొత్త డిజైన్, స్టైలింగ్‌తో పాటు, లేటెస్ట్ టెక్నాలజీతో అందుబాటులోకి రాబోతోంది. కొత్త డిజైన్ డ్యాష్‌లో 12.3-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 14.9-అంగుళాల టచ్‌స్క్రీన్, టచ్-సెన్సిటివ్ నియంత్రణల సెంటర్ కన్సోల్‌లోని ఫిజికల్ బటన్‌లను కంట్రోల్ చేసే ఫ్రీ-స్టాండింగ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. వెనుక భాగానికి 31.3-అంగుళాల 8k థియేటర్ స్క్రీన్ ఉంటుంది. ఇంజిన్ పరంగా, కొత్త-తరం 7 సిరీస్‌ను ఇన్-లైన్ సిక్స్-సిలిండర్ పెట్రోల్, డీజిల్ ఇంజన్‌లతో పాటు ఆల్-ఎలక్ట్రిక్ i7 కార్డ్‌లతో కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది.
BMW X7 ఫేస్ లిఫ్ట్
BMW X7 2022లో మిడ్ లైఫ్ సైకిల్ అప్‌డేట్‌ను అందుకుంది. అప్‌డేట్ చేయబడిన ఇంజన్‌లు, స్టైలింగ్. లేటెస్ట్ టెక్నాలజీని కలిగి ఉంది. ఈ SUV అన్ని ఇంజన్ ఎంపికలలో తేలికపాటి-హైబ్రిడ్ టెక్‌లో ప్యాక్ చేయబడింది. క్యాబిన్ లోపల సరికొత్త iDrive సిస్టమ్‌తో పాటు సింగిల్-పీస్ కర్వ్డ్ డిస్ ప్లే హౌసింగ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 14.9-అంగుళాల టచ్ స్క్రీన్ ఉన్నాయి. ఇంజన్ ఎంపికల విషయానికి వస్తే ఆరు సిలిండర్ పెట్రోల్, డీజిల్ ఇంజన్‌లను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.