COVID EFFECT: ఆర్థిక వ్యవస్థ అదుపు తప్పుతోంది.. కరోనా కల్లోలం నేపథ్యంలో ఆర్బీ ఐ కీలక వ్యాఖ్యలు.. మహమ్మారి కట్టడికి రూ. 50 వేల కోట్ల లిక్విడిటీ.. మరో 2 ఏండ్ల పాటు మారటోరియం పొడిగింపు

దేశంలో కరోనా ప్రభావం అత్యంత తీవ్రంగా ఉందని ఆర్బీఐ వెల్లడించింది. కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతూ విలయ తాండవం చేస్తుందని అభిప్రాయపడింది. కోవిడ్ పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు తెలిపింది. కరోనా తొలివేవ్ నుంచి కోలుకుంటున్న నేపథ్యంలో సెకెండ్ వేవ్ మళ్లీ ఆందోళన కలిగిస్తోందని చెప్పింది.
కరోనా కల్లోలం నేపథ్యంలో ఆర్బీ ఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా సెకండ్ వేవ్‌ను తట్టుకునేందుకు దేశ బ్యాకింగ్ రంగం సిద్ధంగా ఉండాలన్నారు. అవసరమైన మేర ఆదుకునేందుకు ఆర్బీఐ తనవంతు సహకారాన్ని అందిస్తుందన్నారు. వచ్చే ఏడాది మార్చి 22 వరకు కరోనా కట్టడి సదుపాయాల కోసం రూ.50 వేల కోట్ల లిక్విడిటీని ప్రకటించారు.
కరోనా పరిస్థితి నియంత్రణ కోసం ప్రభుత్వ వర్గాలన్నీ కృషి చేయాలని శక్తి కాంత్ దాస్ కోరారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య 2 కోట్లను దాటినందువలన కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. కరోనా కట్టడిలో తమ మద్దతు ఉంటుందన్నారు. కొద్ది రోజుల క్రితం వరకు భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందన్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపుతప్పుతున్నట్లు వెల్లడించారు.
కరోనా నుంచి భారత్ త్వరలోనే బయటపడుతుందనే నమ్మకాన్ని వెలుబుచ్చారు శక్తికాంత్ దాస్. ఏప్రిల్‌లో జరిగిన మధ్యంతర పరపతి సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను అలాగే ఉంచుతున్నట్లు చెప్పారు. రెపో రేటును మార్చి 2022 వరకూ ఓపెన్ గానే ఉంచుతామన్నారు. సులువుగా రుణాలను అందించేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రాధాన్యతా అవసరాలను బట్టి రుణాలను అందించాలన్నారు. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు దీర్ఘకాల రెపో కోసం రూ.10 వేల కోట్లను అందిస్తామన్నారు.
గతంలో రెండు సంవత్సరాల పాటు మారటోరియం సదుపాయం పొందిన వారికి మరో రెండేళ్ల మారటోరియం ప్రకటిస్తున్నట్టు శక్తికాంత్ దాస్ స్పష్టం చేశారు. భారత్ లో విదేశీ మారక ద్రవ్య నిల్వలు 588 బిలియన్ డాలర్లు ఉన్నాయన్నారు. అవే దేశాన్ని కరోనా నుంచి కాపాడుతాయనే నమ్మకం ఉందని శక్తికాంత్ దాస్ వెల్లడించారు.
One thought on “COVID EFFECT: ఆర్థిక వ్యవస్థ అదుపు తప్పుతోంది.. కరోనా కల్లోలం నేపథ్యంలో ఆర్బీ ఐ కీలక వ్యాఖ్యలు.. మహమ్మారి కట్టడికి రూ. 50 వేల కోట్ల లిక్విడిటీ.. మరో 2 ఏండ్ల పాటు మారటోరియం పొడిగింపు”