Multibagger Stocks: బాబోయ్! ఈ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే కోటీశ్వరులు కావొచ్చు, మూడేళ్లలో 80 వేల శాతం లాభాలంటే మాటలా?

తక్కువ సమయంలో ఎక్కువ విలువ సాధించాలంటే మల్టీ బ్యాగర్ స్టాక్స్ బెస్ట్ ఆప్షన్. వీటిలో పెట్టుబడులు పెట్టే వారు టైం కలిసి వస్తే ఏకంగా మిలియనీర్లు అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి టాప్ 8 మల్టీ బ్యాగర్ స్టాక్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. ఈ 8 స్టాక్స్ కేవలం మూడు సంవత్సరాల్లో 80 వేల శాతం రిటర్న్స్ ఇచ్చాయంటే ఆశ్చర్యం కలగకమానదు. ఇంతకీ ఆ స్టాక్స్ ఏవో ఇప్పుడు చూద్దాం..
చాలా మంది కామన్ గా చెప్పే మాట ఒకటుంటుంది. అదే, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం చాలా రిస్క్. ఒక్కోసారి ఇది నిజమే అనిపిస్తుంది. దానికి కారణం స్టాక్ మార్కెట్ గురించి పూర్తిగా తెలియకుండా ఇన్వెస్ట్ చేస్తే తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. కానీ, స్టాక్ మార్కెట్ల గురించి కాస్త పరిశీలించి, పట్టు సాధిస్తే తిరుగే ఉండదు. స్టాక్ మార్కెట్లలో వచ్చే లాభం మరెక్కడా ఉండదు. ప్రధానంగా మల్టీ బ్యాగర్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే కోటి రూపాయల రిటర్న్ కూడా రావొచ్చు. ఊహించలేనంత డబ్బు అందుకోవచ్చు. ఇంతకీ తక్కువ పెట్టుబడితో తక్కువ సమయంలో ఎక్కువ లాభం వచ్చిన మల్టీ బ్యాగర్ స్టాక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
కేవలం 3 ఏండ్లలో 80 వేల శాతం లాభాలు
ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే మల్టీ బ్యాగర్ స్టాక్స్ కేవలం 3 సంవత్సరాల్లో 80 వేల శాతం రిటర్న్స్ అందుకున్నాయి. ఇందులో SEL మానుఫాక్చరింగ్ కంపెనీ, Jagsonpal ఫార్మాస్యూటికల్స్, Dynacons సిస్టమ్స్ అండ్ సొల్యూషన్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్స్, లాన్సర్ కంటైనర్ లైన్స్, సలాసర్ టెక్నో ఇంజినీరింగ్, GSS ఇన్ఫోటెక్ స్టాక్స్ పెట్టుబడిదారులకు లాభాల పంట పండించాయి. ఈ స్టాక్స్ అన్నీ వరుసగా మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అందించాయి. గత మూడు సంవత్సరాల క్రితం ఇన్వెస్ట్ చేసిన వారికి మంచి లాభాలు వచ్చాయి.
SEL Manufacturing Company
ఎస్‌ఈఎల్ (SEL Manufacturing Company) కంపెనీ వర్టికల్లీ ఇంటిగ్రేటెడ్ టెక్స్ టైల్ కంపెనీ. దీని స్టాక్ 2022లో 1,550 శాతం వృద్ధి సాధించడం విశేషం. 2021లో 1,523 శాతం లాభాలు అందించగా, ఈ ఏడాది అంతకంటే ఎక్కువు ఇచ్చింది. 2020లో 197 శాతం రిటర్న్స్ ఇచ్చింది. 2019లో ఈ కంపెనీ షేర ధర రూ. 0.78గా ఉండగా 2022 ముగిసే సమయానికి ఏకంగా రూ. 621కి చేరింది. అంటే మూడు సంవత్సరాల్లో ఏకంగా 79, 541 శాతం లాభం వచ్చింది.
Jagsonpal Pharmaceuticals share
జాగ్‌సన్‌పాల్ ఫార్మాస్యూటికల్స్ (Jagsonpal Pharmaceuticals share) స్టాక్ కూడా కనీవినీ ఎరుగని రీతిలో పెరిగింది 2019లో రూ.25గా ఉన్న కంపెనీ స్టాక్ వ్యాల్యూ ఇప్పుడు ఏకంగా రూ. 371కు చేరింది. ఇన్వెస్టర్లు భారీగా లాభాలను పొందారు.
Dynacons Systems & Solutions
ఈ కంపెనీ స్టాక్ కూడా గత మూడు సంవత్సరాల్లో 1,303 శాతం లాభాలను అందుకుంది. 2020లో 162 శాతం, 2021లో 150 శాతం,2022లో 114 శాతం లాభాలు పొందారు ఇన్వెస్టర్లు.
Adani Enterprises
అదానీ గ్రూప్‌కు చెందిన అదానీ ఎంటర్‌ప్రైజెస్(Adani Enterprises)కూడా భారీ స్థాయిలో లాభాలను పొందింది. ఈ మూడు సంవత్సరాల్లో కంపెనీ 1,755 శాతం రిటర్న్స్ ఇచ్చింది. 2022లో 125 శాతానికిపైగా లాభం పొందింది. ఈ కంపెనీ రోడ్లు, ఎయిర్‌పోర్ట్స్, డేటా సెంటర్, సోలాల్ మానుఫ్యాక్చరింగ్తో పాటు పలు రంగాల్లో కీలకంగా వ్యవహరిస్తోంది.
Global Capital Markets
గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్స్(Global Capital Markets) స్టాక్ సైతం గడిచిన మూడు సంవత్సరాలు మంచి లాభాలను గడిస్తోంది. ఈ మూడు సంవత్సరాల్లో ఏకంగా 6,410 శాతం రిటర్న్స్ వచ్చాయి. 2022లో ఏకంగా ఈ స్టాక్ 567 శాతం లాభం పొందింది.
లాన్సర్ కంటైనర్ లైన్స్ (Lancer Container Lines), సలాసర్ టెక్నో ఇంజినీరింగ్ (Salasar Techno Engineering), GSS ఇన్ఫోటెక్ కూడా మంచి లాభాలను పొందాయి. బ్యాక్ టు బ్యాక్ భారీగా వృద్ధి సాదించి మల్టీబ్యాగర్లుగా మారాయి. ఈ మూడు సంస్థలకు సంబంధించి స్టాక్ లు వరుసగా 100 శాతం చొప్పున రిటర్న్స్ అందుకున్నాయి.