PM Kisan Yojana Scheme:రైతులకు ముఖ్యగమనిక: అప్లికేషన్ లో ఈ తప్పులు చేయకండి…ఆ పథకం డబ్బులు జమ కావు….!

దరఖాస్తు చేసిన తర్వాత కూడా చాలా మంది రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిథి పథకంలో డబ్బులు జమ కావడం లేదు. దీనికి కారణం దరఖాస్తు సమయంలో చేస్తున్న పొరపాట్లే. దరఖాస్తు చేసేటప్పుడు అక్షరదోషాలు మీకు డబ్బు జమ కాకుండా చేస్తాయని గుర్తుంచుకోండి. ఎందుకంటే ఈ పథకం కింద డబ్బు బదిలీ చేసే మొత్తం ప్రక్రియంతా చాలా కఠినంగా జరుగుతుంది.
అందుకే ఆధార్, దరఖాస్తు, బ్యాంక్ అకౌంట్, రెవెన్యూ రికార్డులలో ఏదైనా పొరపాటు ఉంటే మీ అకౌంట్లో జమ కావాల్సిన ఆరువేల రూపాయాలను కోల్పోవల్సి వస్తుంది. ఈ చిన్న చిన్న తప్పులను సరిదిద్దితే తప్పా పీఎం కిసాన్ సమ్మన్ నిధి నుంచి డబ్బులు జమ కావు. చాలా మంది ఆధార్ నెంబర్ తగ్గించారని, బ్యాంక్ అకౌంట్ నెంబర్ గందరగోళం ఉందని తేలింది. ఈ కారణంగా పథకం ఆటోమెటిక్ సిస్టమ్ అప్ డేట్ చేయడం లేదు. దీంతో లక్షలాది మంది రైతుల అప్లికేషన్లు ఇప్పటికీ పెండింగ్ లోనే ఉన్నాయి.
ఈ పథకంను దరఖాస్తు చేసుకునే రైతులు ముందుగా పీఎం కిసాన్ పథకం పేరిట ఉన్న అధికారిక వెబ్ సైట్ ను సెర్చ్ చేయాలి. దాని ఫార్మర్ కార్నర్ కు వెళ్లి ఎడిట్ ఆధార్ ఫెయిల్యూర్ రికార్డ్స్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేయాలి. తర్వాత క్యాప్చా కోడ్ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయండి. ఎడిట్ కూడా చేయవచ్చు. సెల్ఫ్ రిజిస్టర్డ్ ఫార్మర్ అప్టేషన్ కోసం మరొక ఆప్షన్ ఉంటుంది. దాని ద్వారా తప్పును సరి చేయవచ్చు. మీ పేరులో తప్పు ఉంటే…మీ అప్లికేషన్, ఆధార్ లో మీ పేరు భిన్నంగా ఉంటే దాన్ని ఆన్ లైన్ ద్వారా మార్చుకోవచ్చు. ఇంకేదైనా పొరపాటు ఉన్నట్లయితే దాన్ని సరిదిద్దడానికి వ్యవసాయశాఖను సంప్రదించండి.
ఇవి కూడా చదవండి: వాట్సాప్ లో కొత్త ఫీచర్….అదేంటంటే!
అప్లికేషన్ను నింపేటప్పడు జాగ్రత్తగా ఉండాలి. దరఖాస్తును పూర్తి చేసినప్పుడు సరైన సమాచారాన్ని ఇవ్వాలి. బ్యాంక్ అకౌంట్ కు సంబంధించిన సరైన సమాధానం ఇవ్వాలి. ifcsకోడ్ ను పూరించడం మర్చిపోవద్దు. పని చేసే బ్యాంక్ అకౌంట్ నెంబర్ మాత్రమే ఇవ్వాలి. ఆధార్ నెంబర్ నింపేటప్పుడు అన్ని అంకెలు కరెక్టుగా వేసామా లేదా చెక్ చేసుకోవాలి. భూమి వివరాలు, ఖాస్రా నెంబర్, అకౌంట్ నెంబర్లను జాగ్రత్తగా నింపాలి. అప్లికేషన్ స్టేటస్ ను తెలుసుకోవడానికి హెల్ప్ లైన్ నెంబర్ 011-24300606 సంప్రదించండి.